జైశ్రీరామ్.
ఆర్తిహర,వరమీయు,పతన,విపాటన,విధాన,తారుమారు,హక్కునిల్చు,అత్తరి,జజ్జరా,అపాత్రతా,గర్భ"-అయాచిత"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
"-అయాచిత"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.భ.ర.జ.జ.త.త.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అపాత్ర దానము!దోషమౌ?అయాచిత మీయకుమా!అదే!హక్కై నిల్చు
ధాత్రినిన్!
విపాటనంబగు స్వేచ్ఛయున్!వియత్సుథ దూరమునౌ!విధానంబే!తారు
మారునౌ?
స్వ పాప మెంచగ నౌ నిలన్!జయంబది యూహిలనౌ!సదానందంబెంచు
భవితన్!
ప్రపూర్ణ చిద్వర!ఖ్యాతినిన్!ప్రయత్నము!మంచి యవన్!బుధామోదంబౌ
నటుల్?
అర్థములు:-
విధానము=పద్ధతి,సృష్టి తీరు,విపాటనము=బ్రద్ధలు కాబడు,వియత్సుథ=
ఆకాశామృతము,వాన,ప్రపూర్ణ చిద్వర=నిండగు హృద్వరీయమగు,
.
1.గర్భగత"-ఆర్తిహర"-వృత్తము.
బృహతీఛందము.జ.భ.ర.గణములు.వృ.సం.182.
ప్రాసనియమము కలదు.
అపాత్ర దానము దోషమౌ?
విపాటనంబగు స్వేచ్ఛయున్!
స్వ పాప మెంచగ నౌ నిలన్!
ప్రపూర్ణ చిద్వర!ఖ్యాతినిన్!
2.గర్భగత"-వరమీయు"-వృత్తము.
అనుష్టుప్ఛందము.జ.జ.లగ.గణములు.వృ.సం.110.
ప్రాసనియమము కలదు.
అయాచిత మీయకుమా!
వియత్సుథ దూరమునౌ!
జయంబది యూహిలనౌ?
ప్రయత్నము మంచి యవన్!
3.గర్భగత"-పతన"-వృత్తము.
బృహతీఛందము.య.త.ర.గణములు.వృ.సం.162.
ప్రాసనియమము కలదు.
అదే!హక్కై నిల్చు ధాత్రినిన్!
విధానంబే!తారు మారునౌ!
సదానందం బెంచు భవితన్?
బుధామోదంబౌ నటులన్!
4.గర్భగత"-విపాటన"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.భ.ర.జ.జ.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అపాత్ర దానము దోషమౌ!అయాచిత మీయకుమా!
విపాటనంబగు స్వేచ్ఛయున్!వియత్సుథ దూరము నౌ!
స్వ పాప మెంచగ నౌ నిలన్!జయంబది యూహిలనౌ?
ప్ర పూర్ణ చిద్వర!ఖ్యాతినిన్!ప్రయత్నము మంచి యవన్!
5.గర్భగత"-విధాన"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.జ.జ.మ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అయాచిత మీయకుమా!అదే!హక్కై నిల్చు ధాత్రినిన్!
వియత్సుథ దూరము నౌ!విధానంబే!తారుమారు నౌ!
జయంబది యూహిల నౌ?సదానందం బెంచు భవితన్?
ప్రయత్నము మంచి యవన్!బుధా మోదంబౌ!నటుల్!
6.గర్భగత"-తారుమారు"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.జ.జ.మ.ర.జ.ర.జ.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అయాచిత మీయకుమా!అదే!హక్కై నిల్చు ధాత్రినిన్!అపాత్ర దానము
దోషమౌ!
వియత్సుథ దూరము నౌ!విధాంబే!తారుమారు నౌ!విపాట నంబగు
స్వేచ్ఛయున్!
జయంబది యూహిల నౌ!సదానంబెంచు!భవితన్?స్వ పాప మెంచగ
నౌ నిలన్!
ప్రయత్నము మంచి యవన్!బుధా మోదంబౌ నటుల్!ప్రపూర్ణ చిద్వర
ఖ్యాతినిన్!
7.గర్భగత"-హక్కు నిల్చు"-వృత్తము.
ధృతిఛందము.య.త.ర.జ.భ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అదే!హక్కై నిల్చు ధాత్రినిన్!అపాత్ర దానము దోషమౌ!
విధానంబే!తారు మారు నౌ!విపాట నంబగు స్వేచ్ఛయున్!
సదానందం బెంచు భవితన్?స్వ పాప మెంచగనౌ?నిలన్!
బుధా మోదంబౌ నటుల్!ప్రపూర్ణ చిద్వర ఖ్యాతినిన్!
8.గర్భగత"-అత్తరీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.య.త.ర.జ.భ.ర.జ.జ.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అదే!హక్కై నిల్చు ధాత్రినిన్!అపాత్ర దానము దోషమౌ!అయాచిత
మీయకుమా?
విధానంబే!తారుమారు నౌ!విపాటనంబగు స్వేచ్ఛయున్?వియత్సుథ
దూరము నౌ!
సదానందం బెంచు భవితన్?స్వ పాప మెంచగ నౌనిలన్?జయంబది!
యూహిల నౌ!
బుధామోదంబౌ!నటుల్!ప్రపూర్ణ చిద్వర ఖ్యాతినిన్!ప్రయత్నము మంచి
యవన్!
9.గర్భగత"-జజ్జరా"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.జ.జ.ర.స.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అయాచిత మీయకుమా!అపాత్ర దానము దోషమౌ?
వియత్సుథ దూరము నౌ!విపాటనంబగు స్వేచ్ఛయున్!
జయంబది యూహిల నౌ!స్వ పాప మెంచగ నౌ నిలన్!
ప్రయత్నము మంచి యవన్!ప్రపూర్ణ చిద్వర ఖ్యాతినిన్?
10,గర్భగత"-అపాత్రతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.జ.జ.ర.స.జ.మ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అయాచిత మీయకుమా!అపాత్ర దానము దోషమౌ!అదే!హక్కై నిల్చు
ధాత్రినిన్!
వియత్సుథ దూరము నౌ!విపాటనంబగు స్వేచ్ఛయున్!విధానంబే!
తారుమారు నౌ!
జయం బది యూహిల నౌ!స్వ పాప మెంచగ నౌ!నిలన్?సదానందం
బెంచు భవితన్?
ప్రయత్నము మంచి యవన్?ప్రపూర్ణ చిద్వర ఖ్యాతినిన్?బుధా మోదం
: బౌ నటుల్!
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.