జైశ్రీరామ్.
శ్లో|| ఆద్భిర్గాత్రాణి శుధ్యన్తి మనస్సత్యేన శుధ్యతిlవిద్యాతపోభ్యాం భూతాత్మా బుద్ధిః జ్ఞానేన శుధ్యతిll
తే.గీ. శుద్ధి చేయును దేహమున్ శుద్ధ జలము.
సత్యమది శుద్ధి మనమును సరిగ చేయు,
జ్ఞాన మది బుద్ధికిన్ శుచిఁ గలుగఁ జేయు,
ఆత్మశుద్ధిని తపమదే యమరఁ జేయు.
భావము. "జలములచేత శరీరము శుద్ధియగును. సత్యముచేత మనస్సు శుద్ధియగును. జ్ఞానముచే బుద్ధి శుచియగును. తపస్సుచే ఆత్మ పరిశుద్ధమగును".
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.