గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఆగస్టు 2020, శనివారం

సోదరభారతీయులారా! అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

ఓం నమో నారసింహాయ
సోదరభారతీయులారా! అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
శ్రీమద్భారతమాత పుత్రునిగ భాసించన్ మహద్యోగమున్
బ్రేమన్ శ్రీహరి కొల్పి యుండవలయున్, విశ్వంబులోనన్ కవుల్
ధీమంతుల్ మన భారతాంబ సుతులే దీపింతు రిద్ధాత్రిపై.
శ్రీమన్మంగళ భారతాంబ! ప్రణతుల్, చిన్మూర్తివై వెల్గుమా.
ఎందరో మహనీయులయిన త్యాగధనుల కృషి ఫలితమే మనకు లభించిన స్వాతంత్ర్యము. 
వారి త్యాగఫలమయిన ఈ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్న మనం క్రమశిక్షణతో మెలుగుతూ, మన ప్రజ్ఞాపాటవాలతో మన దేశ కీర్తి దేశాంతరాల్లో మారుమ్రోగేలా చేస్తూ భారతమాతకు  గర్వకారణంగా నిలుద్దాం. ఆ శ్రీహరి చరణాలను ఆశ్రయించి పరస్పర సహకారంతో ఆనందమయ జీవితం గడుపుదాం.  జైహింద్ అని నినదిద్దాం.
వందే మాతరమ్.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.