జైశ్రీరామ్.
అభినందన్‌కు స్వాగతమ్. సుస్వాగతమ్.
శ్రీకర భారతాంబ గుణశేఖరపుత్రుఁడవీవటంచు, ర
త్నాకర భారతాంకు ముదంబును గూర్చెడి రత్నమీవటం
చాకృతిఁ గొన్న దైవమనుచందరు నిన్ను ప్రశంస చేయుచున్
నీకు శుభంబులన్ పలుక నిల్చిరి నీకయి, స్వాగతమ్మయా!
నిన్నునుతింపఁ జాలమయ. నీ మహనీయత నెన్న జాల. నిన్
గన్న మహాత్ములన్ దలచి గౌరవమొప్ప నుతింతుమయ్య. రా
మన్నదయా సముద్రుఁడయ. హాయిగ నిన్ గని బ్రోచునయ్య. నిన్
మన్ననతోడ గాంచుచును మాన్యులు నిన్ నుతియించుచుండిరే.
నీకు శుభంబులౌత మహనీయుఁడ నీభువి భారతాంబకున్
మాకును శోభనాళి వరమై లభియించుత నీదు సత్కృపన్.
లోకమునందు మానవులలో సహజంబుగ నీ గుణాళి సు
శ్లోక విధానమున్ వెలుగు శోభిలుమా శత వర్షముల్ సుధీ!
జైహింద్.
1 comments:
చాలా చక్కటి ఉత్పలమాలికా పద్మాలు (పద్యాలు) అందించారు. ఈ వీరుని దేశభక్తి, త్యాగనిరతి, ధైర్య సాహసాలను బాగా కొనియాడారు. అతనికి ఇలాంటి వీరులు ఎందరో ఉన్నారు వారందరికీ నిండు నూరేళ్ళు ఆయుష్యు కీర్తీ ప్రతిష్టలు కలగాలని కోరుకుంటున్నాను;
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.