గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, మార్చి 2019, సోమవారం

రామకృష్ణ విలోమ కావ్యమ్. అవతారిక శ్లో.1.

జైశ్రీరామ్.
ఆర్యులకు శుభోదయమ్.
రామకృష్ణవిలోమకావ్యమ్. రచయిత సూర్యకవి. కాలం16వశతాబ్ది పూర్వార్థం. ఈయన దైవజ్ఞుడు అంటే జ్యోతిష్యుఁడు.
ఈ కవి ఇతర రచనలు సూర్యప్రకాశం, లీలావతి అనే జ్యౌ
తిష గణిత శాస్త్రాలకుద టీకలు కూడా
రచించినాడు..
    
రామకృష్ణవిలోమకావ్యం ద్వ్యర్థి
కావ్యమని.ప్రత్యేకించి చెప్పవలసిన
అవసరంలేదు.ప్రారంభంనుంచి తుది
వరకూ ప్రతిశ్లోకం రామకథాసంబంధి,
తుది నుంచి ప్రారంభంవరకూ ప్రతి    శ్లోకం కృష్ణకథ.

ఈ విలోమ కృతి2003(స్వభాను)లో
సాధనగ్రంథమండలి తెనాలి వారు తెలుగు లిపిలో తెలుగు ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలతో ప్రచురించినారు.
   
రామకృష్ణవిలోమకావ్యనందు 36
శ్లోకాలలో రామకృష్ణకథలను రచించి
నాడు..ఈ చిత్రకృతిలోని 36 శ్లోకాలు
ఇంద్రవజ్ర,శాలిని,రథోద్ధతం,అనుష్టుప్,
విద్యున్మాల అనే వృత్తాలలో రచించి నాడు.ఈ కవివర్యుడు సభంగ, గత ప్రత్యాగత యమకాలనే వాడినాడు.
ఈ ప్రక్రియ అద్భుతమైన సర్కస్ లాం
టిది.కనుక ఈ కావ్యంలో అద్భుతరసం
తప్ప మిగతా రసాలు ఉండవుగాక
ఉండవు.అయితే కవిగారి సాహిత్య
వ్యాయామాన్నిఉ,పాండిత్యకండబలా
న్ని గ్రహించిఅద్భుతాశ్చర్యాలనుపొంద వలసి ఉంటుంది.

ఈ గ్రంథంలో "రామకథ" అనే గంగ,
"కృష్ణకథ"  అనే  యమున,  సూర్యకవి
గారి కవిత్వం అనే సరస్వతి  కలిసిన
ప్రయాగలాంటి కవనప్రవాహంలో చిత్ర
కవితాభిమానులు పఠనమనే స్నానం
ఆచరించడం మహదానందాశ్చర్యదా
యకం. ఈ విషయం కింది శ్లోకంలో ఉంది----
శ్లో.భాగీరథీ రామకథాతిరమ్యా
కాలిందికా కృష్ణకథామనోజ్ఞ,
సరస్వతీ సూర్యకవేః తృతీయా
ప్రయాగేSత్ర మతిః కవీనామ్. 
ఆర్యులారా! దైవజ్ఞ శ్రీ సూర్యకవి విరచిత రామకృష్ణ విలోమ కావ్యమ్ శ్రీ మేళ్ళచెర్వు వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తెలుఁగు వ్యాఖ్యానముతో రోజుకొక శ్లోకమును ఆంధ్రామృతం ద్వారా అందుకొనఁగలరు.
వందనములు.
(సశేషమ్)
జైహింద్.
Print this post

1 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

ధన్యవాదాలు గురుదేవా చాలా మంచి మంచి విషయమును బ్లాగు వీక్షకులకు పంచుచున్నారు. 🙏🙏🙏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.