గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, డిసెంబర్ 2015, సోమవారం

అభ్యాగతః స్వయం విష్ణుః.

జైశ్రీరామ్.
ఆర్యులారా! 
 పదచిత్ర రామాయణ కవి శ్రీ విహారి గారు, 
ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు భాషాధ్యక్షులు డా.వెల్దండ నిత్యానందం గారు, 
పద్యకళాప్రవీణ డా.ఫణీంద్ర గారు 
మాయింటికి వచ్చి మా అందరికీ మహదానంద కారకులయినారు. 


కంద - తేటగీతి గర్భ చంపక మాల.
వర గుణధాముడౌ హరియు, బ్రహ్మ నటేశులు హాయిఁ గొల్ప  నా
దరమతులై కదా యిట విహారియు, నిత్య  ఫణీంద్రలౌచు సు
స్థిర ఘనతన్ ననున్ వరలఁ జేయ నయంబున వచ్చినారు. హ్లా
ద రస ఘృణిన్ సదా  కని ముదంబున మత్ శుభ కాంక్షఁ దీర్చగా.!

చంపకమాల గర్భస్థ కందము.
గుణధాముడౌ హరియు, బ్ర
హ్మ, నటేశులు హాయిఁగొల్ప  నాదరమతులై
ఘనతన్ ననున్ వరలఁజే
య నయంబున వచ్చినారు.హ్లాద రసఘృణిన్.

చంపకమాల గర్భస్థ తేటగీతి.
హరియు, బ్రహ్మ, నటేశులు హాయిఁగొల్ప 
యిట విహారియు, నిత్య ఫణీంద్రలౌచు
వరలఁజేయ నయంబున వచ్చినారు
కని ముదంబున మత్ శుభ కాంక్షఁ దీర్చ.

సాక్షాత్కరించిన త్రిమూర్తులైన వీరికి 
నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియఁ జేసుకొనుచున్నాను.
జైహింద్.
Print this post

2 comments:

కంది శంకరయ్య చెప్పారు...

నిన్న మియాపూర్ మీటింగుకు వచ్చి ఉంటే నాకు కూడా వారిని కలిసే భాగ్యం లభించి ఉందేది. మిమ్మల్ని, ఆచార్య ఫణీంద్ర గారిని ప్రక్కప్రక్కన చూస్తుంటే మహదానందంగా ఉంది.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శంకరార్యా! మీరూ వచ్చి ఉంటే సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ నాలుగు రూపాలతో మా గృహాన్ని పావనం చేసినట్లు భావించి ఉండేవాడినండి. ఏది ఏమైనా మీరంత దూరంనుండి శ్రమించిరావాలని మేము కోరుకోమండి. సంతోషకరమైనదే మీరు చేస్తే మాకూ ఆనందం. మీ అభిప్రాయం తెలియఁజేసినందులకు ధన్యవాదాలండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.