గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, డిసెంబర్ 2015, బుధవారం

న దేవాంశో దదాత్యన్నం . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్
శ్లో. న దేవాంశో దదాత్యన్నం!
నారుద్రో రుద్ర మర్చ్యతే!
నా నృషిః కురుతే కావ్యం!
నావిష్ణుః పృథివీపతిః!!
గీ. కలుఁగ దైవాంశ దాతగా వెలుగునతఁడె.
రుద్రుఁడగువాఁడె చేయు రుద్రార్చనంబు.
ఋషియె కావ్యంబు వ్రాయనౌనెన్ని చూడ.
కలుఁగ విష్ణ్వంశ రాజుగా వెలుగునతఁడె.
భావము. దేవతాంశ లేనియెడల అన్నదాత కాజాలడు; రుద్రాంశ లేనిచో రుద్రుని అర్చించడు; ఋషి గానిచో కావ్యమును రచించలేడు; విష్ణు అంశ లేనివాడు రాజ్యపాలకుడు కాలేడు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు .
నుజమేకొంత జన్మ సుకృతం ఉండాలి , ముఖ్యంగా దైవాంశ లేందే ఏపనీ చేయలేరు. మంచి విషయాన్ని చెపారు .ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.