గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, డిసెంబర్ 2015, మంగళవారం

గోమాత ప్రసవించిందని దుర్గేశ్వరరావుగారు పొందుతున్న ఆనందం చూడండి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ బల్లేపల్లి దుర్గేశ్వరరావుగారి గోమాలచ్చిమి మగబిడ్డకు నిన్న జన్మనిచ్చింది. దానికి ఆ స్వామి పొందుతున్న ఆ ఆనందం మాటలకందనిది. వారి మాటలలోనే అది మీరు చూడండి.
 అప్పుడే పుట్టిన బిడ్డ. తల్లీ కొడుకుల పలకరింపులు.
(శ్రీ దుర్గేశ్వరరావుగారి మాటలు)
నిన్నమొన్నటిదాకా చిన్నపిల్లలా గెంతులు వేసిన లక్ష్మి  [గోమాత] ఈరోజు తల్లి  అయింది  శుభసమయంలో  కపిలవర్ణపు మోముపై విభూది అలుముకున్నట్లు ఉన్న నందుబాబుకు జన్మనిచ్చింది . తెల్లవారుఝాము  నాలుగుగంటలకు    నేను మా  ఆవిడా గదిలోంచి బయటకొచ్చి చూసేసరికి లక్ష్మి మందిరం ముందున్న మండపం [ఆవిడ రోజూ అక్కడ పనుకోవటానికే ఇష్టపడుతుంది]లో నుండి క్రిందకు దిగి ఉంది . ఏమ్మా లేచావా ? అంటూ నేను వెళ్లి తలుగు విప్పదీయగనే చేలోకి వెళ్లి నిలబడింది . బయట చలిగాఉంది రమ్మని తీసుకురావటానికి ప్రయత్నించే  సమయానికే నెప్పులు రావటం  లక్ష్మి ప్రసవనొప్పులతో అల్లాడిపోవటం మొదలైంది ,నేను  ఊర్లో ఉన్నమావాళ్ళకు ఫోన్ చేసే పిలచాను   కార్తీకచివరి సోమవారం  ఈరోజు ప్రభాతసమయ శుభముహూర్తాన  నందు బాబును ఈనింది .   కార్తీక అభిషేకాలలో పాల్గొంటున్న సాధకులంతా  ఆ సమయానికి  పీఠానికి చేరుకున్నారు . కార్తీక మాసం పూర్తయ్యే లోగా స్వామి అభిషేకానికి  పాలు ఇవ్వటానికే లక్ష్మి ఈనిందని అందరూ  సంతోషం తో కేరింతలు కొట్టారు మధ్యాహ్నం నుండి లేచి తిరుగుతున్నది నందిబాబు.
ఇంట్లో ఉన్న రెండు జర్మన్షేఫర్డ్ కుక్కలు [రాజు,చంటి ] దూడ దగ్గరకు రావాలని ఒకటే గొడవ .వాటి సంతోషం పట్టనలవి  కాకుండా ఉంది .పొద్దున్నుంచి  అన్నము కూడా సరిగా తినకుండా దగ్గరకొచ్చినప్పుడల్లా నంది బాబును నాకుతూ తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నాయి.
విన్నారు కదా!
హృదయము ప్రేమ భావనను శ్రీకరమై వికసించి యున్నచో
పదిలముగా వసించునట పార్వతి, లక్ష్మి, సరస్వతమ్మయున్.
కదలక నిల్చి లోకమును కమ్మగ చూపి మనోజ్ఞ భావనా
సుధలననంత సంతసము శోభిలఁ గూర్తురమోఘమద్దియే.
అందు చేత మనము హృదయంలో ప్రేమను నింపుకో గలిగితే అనంత ఆనందం మన సొత్తే. అదే మనకు అమోఘమైన ఆరోగ్యాఅన్నిచ్చే ఔషధం. ఇంక వృషభము, ధర్మము వీటి విషయానికి వస్తే
అని గ్రహించవచ్చును.
లోకాః సమస్తా స్సుఖినో భవంతు.
జైహింద్. 
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
గోమాతను సేవించ గలగడం గొప్ప అదృష్టం. అది అందరికీ లభించదు .శ్రీ దుర్గేశ్వర రావు గారి కృషి అనన్యం .వారు ధన్యులు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.