గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, డిసెంబర్ 2015, ఆదివారం

శ్రీ రాజమహేంద్రవర పుత్రిక ఐన ప్రజా పత్రికకు ధన్యవాదములు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ తల్లాప్రగడ రావు గారు ముఖ పుస్థకములో ఉంచిన కనులకు మిరుమిట్లు కొలిపే జగన్మాత చిత్రం నాకంట పడింది. మెలమెలా మెఱిసిపోవుచున్నా ఆ తల్లి చిత్రాన్ని చూడగానే నాకేదో తెలియని ఆనందం కలిగింది. ఆ ఆనందంలో నాకు భారతీ! అనే మకుటంతో చంపకమాల వృత్తములో పద్యములు ధారాపాతముగా పొంగుకొని వచ్చాయి. నేను ఆ అంతు తెలియని ఆనందంలో ఆ భారతీమాత వ్రాయించినవన్నీ వ్ర్రాశాను.  
ఆ జగజ్జనని భారతీమాత నాచేత శ్రీ చాంద్రమాన మన్మధ నామ సంవత్సర కార్తీక శుద్ధ విదియా భృగువారం అనగా తే.13-11-2015న 16/24 గంటలలో చంపకభారతీశతకరచన చేయించింది. ఈ విషయమునెఱింగిన ప్రజాపత్రిక వారపత్రిక వారు తే.20-11-2015 తమ ప్రజాపత్రికలో ప్రకటించారు.
వారి అభిమానానికి నా ధన్యవాదములు.
శ్రీ తల్లాప్రగడ రావుగారు ముఖపుస్థకమునందుంచిన జగన్మాత మెఱుపుల చిత్రమే నా కవితావేశమునకు మూలము. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియఁ జేసుకొంటున్నాను.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కేవలం 16 గంటల్లో శతకము వ్రాయ గల అదృష్టం , సరస్వతీ పుత్రులు శ్రీ చింతా రామకృష్ణా రావుగారికే లభించింది .చాలా ఆనందంగా ఉంది .మరిన్ని శతకాలను అవలీలగా వ్రాయగ గల భాగ్యము ఆదేవి కరుణించుగాక .దీవించి అక్క

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అక్కయ్యా! ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.