గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, డిసెంబర్ 2015, సోమవారం

గర్భరక్షా స్తోత్రం

జైశ్రీరామ్.
తమిళ నాడు లో కుంభకోణం దగ్గరలో ఉన్న శ్రీ గర్భ రక్షామ్బిక (తిరుక్కవుగావుర్ అనే వూరు లో, ఈ పదమునకు అర్ధం తమిళం లో గర్భ రక్షా అని…) అమ్మ వారి ఆలయం ఉన్నది. అక్కడ అమ్మ వారు గర్భ రక్షామ్బిక అమ్మ గాను, అయ్య వారు ముల్లైవ నాథర్ అనే పేరుతో ప్రసిద్ధము. ముల్లైవ నాథర్ అంటే మల్లికార్జున స్వామి వారు. ఇక్కడ స్వామి వారికి కేవలం మల్లె నూనె తో అభిషేకం చేస్తారు.
ఇది శౌనక మహర్షి విరచించిన గర్భ రాక్షాంబికా స్తోత్రం. ఈ స్తోత్రం గర్భం దాల్చబోయే వాళ్ళు, గర్భం దాల్చిన తల్లులు ఎవరైనా చదివితే, చక్కగా ముద్దులొలికే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి లానో, చిన్ని కృష్ణుడి లాంటి పిల్లలు పుడతారు. ఈ ఆలయం లో అమ్మ వారి దగ్గర ఉంచి మంత్రించిన నూనె ఇస్తారు. దానిని గర్భం దాల్చిన తల్లి యొక్క ఉదరమునకు వ్రాసుకుంటే చక్కగా ప్రసవం అవుతుంది అని నమ్మకం. సత్సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నించే దంపతులు ఎవరైనా ఉంటే, వాళ్ళు అక్కడికి వెడితే, మంత్రించిన నెయ్యి ప్రసాదం గా ఇస్తారు. దానిని దంపతులు ఇద్దరూ, ౪౦ రోజులు నిద్రించే ముందు సేవిస్తే వెంటనే గర్భం దాల్చడం జరుగుతుంది అని నమ్మకం. ఈ విధంగా పిల్లలు కలిగిన తర్వాత అక్కడ అమ్మ వారి ఎదుట ఒక ఊయల ఉంటుంది, అందులో పుట్టిన పిల్ల/పిల్లా వాడిని ఉంచి అమ్మ వారి ఆశీస్సులు పొంది రావాలి. ఆ మందిరం ఎంతో ప్రశాంతముగా ఉంటుంది.
శౌనక మహర్షి విరచిత గర్భరక్షా స్తోత్రం
ఏహ్యేహి భగవాన్ బ్రహ్మన్
ప్రజా కర్తా, ప్రజా పతే
ప్రగృహ్షీణివ బలిం చ ఇమం
ఆపత్యాం రక్ష గర్భిణీమ్.  1 
అశ్వినీ దేవ దేవేసౌ
ప్రగృహ్ణీతమ్ బలిం ద్విమం
సాపత్యాం గర్భిణీమ్ చ ఇమం
చ రక్షతాం పూజ యనయా  2 
రుద్రాశ్చ ఏకాదశ ప్రోక్తా
ప్రగృహనంతు బలిం ద్విమం
యుష్మాకం ప్రీతయే వృతం
నిత్యం రక్షతు గర్భిణీమ్.  3 
ఆదిత్య ద్వాదశ ప్రోక్తా
ప్రగ్రహ్ణీత్వం బలిం ద్విమం
యుష్మాగం తేజసాం వృధ్య
నిత్యం రక్షత గర్భిణీమ్.  4 
వినాయక గణాధ్యక్షా
శివ పుత్రా మహా బల
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్.  5 
స్కంద షణ్ముఖ దేవేశా
పుత్ర ప్రీతి వివర్ధన
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్.  6 
ప్రభాస, ప్రభవశ్శ్యామా
ప్రత్యూషో మరుత నల
దృవూ ధురా ధురశ్చైవ
వసవోష్టౌ ప్రకీర్తితా
ప్రగ్రహ్ణీత్వం బలిం చ ఇమం
నిత్యం రక్ష గర్భిణీమ్.  7 
పితుర్ దేవీ పితుశ్రేష్టే
బహు పుత్రీ మహా బలే
భూత శ్రేష్టే, నిశావాసే
నిర్వృతే, శౌనక ప్రియే
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్. 8 
రక్ష రక్ష మహాదేవ,
భక్తానుగ్రహకారక
పక్షి వాహన గోవిందా
సపత్యాం రక్ష గర్భిణీమ్. 9 
ప్రతీ రోజూ పూజా మందిరంలో, అమ్మ వారికి కొంచెం పళ్ళు, పాలు లేదా ఏదైనా పదార్ధం నివేదన చేసి, ఈ గర్భరక్షా స్తోత్రం
2వ నెలలో, మొదటి రెండు శ్లోకములు – రోజూ 108 సార్లు
3వ నెలలో, మొదటి మూడు శ్లోకములు – రోజూ 108 సార్లు
4వ నెలలో, మొదటి నాలుగు శ్లోకములు – రోజూ 108 సార్లు
5వ నెలలో, మొదటి ఐదు శ్లోకములు – రోజూ 108 సార్లు
6వ నెలలో, మొదటి ఆరు శ్లోకములు – రోజూ 108 సార్లు
7వ నెలలో, మొదటి ఏడు శ్లోకములు – రోజూ 108 సార్లు
8వ నెలలో, మొదటి ఎనిమిది శ్లోకములు – రోజూ 108 సార్లు
9వ నెలలో, మొదటి తొమ్మిది శ్లోకములు – రోజూ 108 సార్లు  
చదువుకోవాలి.
జైహింద్...
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సంతానము కొరకు ఎన్నో తెలియని విషయములను తెలియ జెప్పారు .చాలా బాగుంది .సంతు కావాలనుకున్న వారికి మంచి ఉపయుక్తము కాగలదు . ధన్య వాదములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.