గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, డిసెంబర్ 2015, బుధవారం

కార్తీక శుద్ధ విదియ నాడు(16/24గంటలలో)నాచే (చంపక)భారతీ శతకమును రచింపఁజేసిన జగజ్జనని.

జైశ్రీరామ్.
ప్రాకటమయ్యె నీ మహిమ బంగరు వెల్గుల కల్పవల్లి! కా
ర్తీక విశుద్ధ సద్విదియ దీప్తము చేసెను నీదు శక్తి. నీ
శ్రీకర శోభ నాదు మది చెన్నుఁగ నిల్చి రచింపఁ జేసె ప్ర
త్యేకముగా దినంబుననె దీపిత చంపక భారతీ కృతిన్.


జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అమ్మ అనుగ్రహ పాత్రులు " ధన్యులు "

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.