గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, డిసెంబర్ 2015, గురువారం

15 - 12 - 2012 వతేదీన జగద్గిరిగుట్ట జి.ప.ఉన్నత పాఠశాల అధ్యాపక వర్గం నన్ను ఆదరించిన తీపి గుర్తు.

జైశ్రీరామ్.
15 - 12 - 2012 వతేదీన జగద్గిరిగుట్ట జి.ప.ఉన్నత పాఠశాల అధ్యాపక వర్గం 
నన్ను ఆదరించిన తీపి గుర్తు
సాటి కలారలెవ్వరు? ప్రశాంత జగద్గిరిగుట్ట బోధాకుల్
మేటి సుబోధకుల్. భువిని మేలుగ సత్కృతి చేయు నేర్పరుల్.
నేటికి కూడ నా మదిని నిల్చిన వారలకంజలించెదన్.
వీటికి మూలమైన దొరవేటికి చెప్పెద ధ్యవాదముల్. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా ఆనందముగా నున్నది . శుభాభి నందనలు .ఇలాంటి తీపి గుర్తులు ఇంకా ఇంకా పొందగలగాలని ఆశీర్వదించి అక్క

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.