జైశ్రీరామ్.
శ్లో. అజరామరవత్ ప్రాజ్ఞో విద్యామర్థం చ సాధయేత్
గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్.
గీ. మరణమన్నది లేనట్టి మహితునివలె
ప్రాజ్ఞుఁడాస్తిని విద్యను పడయవలయు
మృత్యు వొందుట ముందున్న సత్యమనుచు
ధర్మ మొనరించగావలె మర్మము విడి.
భావము. ప్రాజ్ఞుడు తనకు ముసలితనము, మరణము లేవనే భావనతోవిద్యను, ధనాన్ని సంపాదించాలి. మృత్యువు తన జుట్టుపట్టుకొని తీసుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉందనే భావనతో ధర్మాన్ని ఆచరించాలి.
జైహింద్
1 comments:
నమస్కారములు
అవును ప్రతి మనిషి చతుర్విద పురుషార్దములను సక్రమంగా నెరవేరుస్తూ చివరకు గల గమ్యాన్ని గుర్తించి ధర్మా చరణ చేయ గలిగితే అదే మేలిమి బంగారం ధన్య వాదములు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.