గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఏప్రిల్ 2014, సోమవారం

త్రీణి త్యక్త్వా సుఖీభవ. మేలిమి బంగారం మన సంస్కృతి 176.

జైశ్రీరామ్.
శ్లో. లోభమూలాని పాపాని రసమూలాశ్చ వ్యాధయః
ఇష్టమూలాని శోకాని , త్రీణి త్యక్త్వా సుఖీభవ 
గీ. పాప మూలంబు లోభంబు, వలదు, విడుము.
రసన వాంఛనె వ్యాధులరయగ విడువు
మిష్ట మూలంబు శోకం బదేల? విడుము.
మూడిటిని వీడి సుఖములు పొందుమయ్య.
భావము. పాపాలకు లోభమువ్యాధులకు రసప్రీతి (జిహ్వా చాపల్యం),శోకాలకు ఇష్టవస్తువులు మూలాలు. ఈ మూడింటిని వదలిపెట్టి సుఖివై జీవించు.
జైహింద్.
Print this post

2 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ చింతా రామ కృష్ణా రావు గురుదేవులకు పాదాభి వందనములతో ...

చాలా మంచి విషయము తెలియ జేసినారు, కానీ మన సమాజము నందు లోభము, జిహ్వా చాపల్యం యెంతో పెరిగి పోయినవి.

మంచి విషయములు తెలియ జేయు చున్న మీకు ధన్యవాదములు .

శిష్య పరమాణువు

వరప్రసాదు .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఈ మూడింటినీ వదిలి పెట్టడంసామాన్యులకు సాధ్యం కాదు . ప్రయత్న పూర్వకము గా అలవాటు చేసుకుంటే కొంత సాధించ వచ్చు నేమో మంచి విషయం చెప్పారు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.