జైశ్రీరాం.
శ్లో. యో
ధర్మశీలో,
జితమాన రోషో,
విద్యావినీతో , న పరోపతాపీ
స్వదార తుష్టః, పరదార వర్జీ ,
న తస్య లోకే భయమస్తి కించన.
గీ. ధర్మశీలుడు దుర్మానధన విహీన
రోష దూరుడు, వినయ విద్యా సరసుఁడు,
పరుల చెరుపక, తన సతిన్ వలచి, పరుల
కాంతలను కోరని ఘనుడు కాంచు సుఖము.
భావము. ఎవడు ధర్మశీలుడో, ఎవడు దురభిమానాన్నీ, రోషాన్నీ
జయిస్తాడో, ఎవడు విద్యా వినయాలు
కలిగి
ఉంటాడో, ఎవడు పరులకు బాధ కలిగించడో, ఎవడు తన భార్యయందు
సంతుష్టుడై
పరభార్యా
కాంక్ష
వదలివేస్తాడో
వానికి
లోకంలో
ఏమాత్రమూ
భయం
ఉండదు.
జైహింద్
1 comments:
నమస్కారములు
దురాలోచన ఉన్నవారికే భయం . అసలు అటువంటి ఆలోచన లేనివారు హాయిగా గుండెలమీద చెయ్యి వేసుకుని తిరగ గలరు మంచి ఆణి ముత్యం
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.