జైశ్రీరామ్.
ఆర్యులారా!
http://andhraamrutham.blogspot.in/2014/03/blog-post_1.html
ఆంధ్ర కవితా రతనాల బండి మన రాళ్ళబండి కవితాప్రసాద్ గారు నిరాఘాటంగా కొనసాగింప తలపెట్టిన లక్ష పద్యార్చనను
సుందర భావోత్ప్రేరక
మందస్మిత వదనులగుచు మనకందరకున్
విందులు చేయుచునుండిరి
కందాది సుపూరణలను కమనీయముగా.
ఆర్యులారా!
http://andhraamrutham.blogspot.in/2014/03/blog-post_1.html
ఆంధ్ర కవితా రతనాల బండి మన రాళ్ళబండి కవితాప్రసాద్ గారు నిరాఘాటంగా కొనసాగింప తలపెట్టిన లక్ష పద్యార్చనను
సుందర భావోత్ప్రేరక
మందస్మిత వదనులగుచు మనకందరకున్
విందులు చేయుచునుండిరి
కందాది సుపూరణలను కమనీయముగా.
కంద-గీత-గర్భ చంపకమాల.
వర సువిధేయుఁడై తనుపు పార్థివుఁడీ కవితాప్రసాదు ధీ
వరుఁడెపుడున్. లసత్ కవన వాఙ్మధు ధారల జ్ఞానసింధుగా
సరస వినోద వాగ్ రసిక సత్కవితాజవరాళ్ళబండిగా
నరయతగున్! మహానగరినందరికిన్ రతనాలబండిగా !
చంపక గర్భ కందము.
సువిధేయుఁడై తనుపు పా
ర్థివుఁడీ కవితాప్రసాదు ధీ వరుఁడెపుడున్.
స వినోద వాగ్ రసిక స
త్కవితాజవరాళ్ళబండిగా నరయతగున్!
చంపక గర్భ గీతము.
తనుపు పార్థివుఁడీ కవితాప్రసాదు
కవన వాఙ్మధు ధారల జ్ఞానసింధు
రసిక సత్కవి తాజవరాళ్ళబండి
నగరినందరికిన్ రతనాలబండి !
రాళ్ళ బండి మనకు రతనాలబండియే!
లక్ష పద్య రచన నక్షయమగు
నాంధ్రమాత కంఠహారమై చెలువొంద
చేయ బూనె గర్భ చిత్ర గతుల.
చింతా రామ కృష్ణా రావు.
జైహింద్
1 comments:
నమస్కారములు
అవధాన సరస్వతి శ్రీ రాళ్ళ బండి వారి లక్ష పద్యార్చనలోని పూరణలు రెండు భాగములు ఫెస్ బుక్కులో చాలా రోజుల ముందుగానే విన్నాను ఇంకాకొత్తవి వచ్చాఏమొ తెలుప గలరు
మొదటి భాగములో ముందుగా " కంది శంకరయ్య అని " మొట్ట మొదటి పద్యంగా ప్రింటులో వచ్చింది కానీ చదివేటప్పుడు " కంది మల్లయ్య అని " చదివారు
ఇక 7 వపద్యంగా " నేదునూరి .రాజేశ్వరికి " బదులుగా నండూరి .రాజేశ్వరి అని చదివారు .నిజానికి ఆ ప్రశ్న నేను ఇక్కడ ఆటాకి వచ్చినప్పుడు అడిగినదే కదా అని మళ్ళీ అదే ప్రశ్న అడిగాను అదన్నమాట అసలు సంగతి సరే
ఇంకా ఏవైనా పూరణలు వచ్చి ఉంటే తెలుప గలరు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.