జైశ్రీరామ్
శ్లో. యత్ర విద్వజ్జనో నాస్తి, శ్లాఘ్యస్తత్రా உ ల్ప ధీరపి
అపాద పాదపే దేశే హ్యేరండోஉపి ద్రుమాయతే.
అపాద పాదపే దేశే హ్యేరండోஉపి ద్రుమాయతే.
క. విద్వజ్జను లెచటుండరొ
విద్వద్విరహితుఁడు గౌరవింపఁబడునటన్.
పృథ్విజములు లేకుండిన
పృథ్విని యాముదము చెట్టు పెంపు వహించున్.
భావము. ఎక్కడ విద్వాంసులుండరో అక్కడ అల్పజ్ఞుడు కూడా పొగడబడుతాడు. అసలు చెట్టే లేనిచోట ఆముదపు చెట్టే మహావృక్షమౌతుంది.
జైహింద్
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.