జైశ్రీరామ్.
శ్లో. సుఖార్థీ చే త్త్త్యజేద్విద్యాం , విద్యార్థీ చ త్యజేత్సుఖం
సుఖార్థినః కుతో విద్యా ? కుతో విద్యార్థినస్సుఖమ్ ?
గీ. విడువ వలయు సుఖార్థి తా విద్యనపుడు.
గీ. విడువ వలయు సుఖార్థి తా విద్యనపుడు.
విద్య నేర్వగ సుఖములు వీడ వలయు.
సుఖము కోరిన విద్యకు చోటులేదు
విద్య కోరిన సుఖములు వీలుపడవు.
భావము. సుఖాన్ని కాంక్షించేవాడైతే విద్యను వదలిపెట్టుకోవాలి. విద్య కావాలనుకుంటే సుఖాన్ని వదలుకోవాలి. సుఖం కోరేవాడికి విద్య ఎక్కడ ? విద్యకావాలనుకుంటే సుఖం ఎక్కడ ?
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.