గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, ఆగస్టు 2025, శుక్రవారం

తెలుఁగుభాషా దినోత్సవము సందర్భముగా అంధ్రామృతం పాఠకాళికి శుభాకాంక్షలు.

జైశ్రీరామ్. 


నేడు గిడుగు వేంకట రామమూర్తి జయంతి.

తెలుఁగుభాషా దినోత్సవము సందర్భముగా 

అంధ్రామృతం పాఠకాళికి శుభాకాంక్షలు.

కంద గీత గర్భ చంపకమాల

వర గుణ భాసితా! తెలుఁగు భాషను పల్కెడి తీరునెన్ను, స

ద్వర! కను మాన్యుఁడై తెలుఁగు భాతిని వెల్గిన ధీరునెన్ను, ధీ

వర! చను మార్గమే తెలుఁగు  భావన కావ్య గతిన్ దలంచు, భా

స్వర ధనమే కదా తెలుఁగు తీయని కమ్మని దివ్యభాషయౌన్.


చంపక గర్భస్థ కందము.

గుణ భాసితా! తెలుఁగు భా

షను పల్కెడి తీరునెన్ను, సద్వర! కను మా

చను మార్గమే తెలుఁగు  భా

వన కావ్య గతిన్ దలంచు, భాస్వర ధనమే.


చంపక గర్భస్థ తేటగీతి.

తెలుఁగు భాషను పల్కెడి తీరునెన్ను

తెలుఁగు భాతిని వెల్గిన ధీరునెన్ను,

తెలుఁగు  భావన కావ్య గతిన్ దలంచు, 

తెలుఁగు తీయని కమ్మని దివ్యభాష.

జైహింద్.


Print this post

1 comments:

అజ్ఞాత చెప్పారు...

అద్భుతం అన్నయ్యా!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.