గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, ఆగస్టు 2025, బుధవారం

నేడు వినాయక చతుర్ధి సందర్భముగా ఆంధ్రామృత పాఠకమహాశయులకందరికీ శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.🙏🏻

ఓం గం గణాధిపతయే నమః

నేడు వినాయక చతుర్ధి సందర్భముగా శుభాకాంక్షలు.


ఉ.  శ్రీగణనాథుఁ డేలుత విశేష శుభంబుల నిచ్చుచున్ మిమున్,

రోగ విదూరులౌచును, పరుల్ మిము మెచ్చు విధంబునొప్పి, స

ద్యోగముతోడ బంధువు లహోయన వృద్ధిని గాంచుచుండుడీ,

సాగిలి మ్రొక్కువారలకు చక్కగ శ్రీ గణనాథుఁడండయౌన్.

జైహింద్.

 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.