జైశ్రీరామ్.
సభాధ్యక్షులు
శ్రీ వాసుదేవరావు.
👇🏻
ఆ.వె. వాసుదేవరావు వరసభాధ్యక్షులై
వరలఁజేయు సభను భవ్యగతిని,
వాసుదేవుఁడేలు వసుధపై వీరిని
శుభచయంబు నిడుచు శోభిలంగ.
రాఘవ శతక గ్రంథావిష్కర్త
శ్రీ చిలకపాటి విజయరాఘవాచార్యులు.
👇🏻
ఉ. ఆర్యులు చిల్కపాటి పరమామృతమూర్తులు దివ్య రాఘవా
చార్యులు రాఘవాఖ్య నుత సత్ శతకంబు జగద్ధితంబుగా
నార్యులు మెచ్చ లోకమునకర్పణ జేసిరి, యీ మహాత్ము సత్
కార్యములెల్ల శోభిలుత! గణ్యని రాఘవుఁడేలు మేలుగాన్.
ముఖ్య అతిథి
శ్రీ అద్దంకి రాఘవాచార్యులు
👇🏻
తే.గీ. రాఘవార్యులద్దంకి రమ్యమతులు
రమణుఁడగు రామచంద్రుని ప్రాణసములు,
వీరి నెన్నగ నిచట నెవ్వారు కలరు?
శుభపరంపరన్ నిరతమున్ శోభిలుధర.
శ్రీ భాగవత ప్రచార సమితి కార్యదర్శి శ్రీ బండిశ్రీనివాసు భాగవతోత్తములు.
👇🏻
ఆ.వె. బండిశ్రీనివాసు భాగవతోత్తము
లతనినేలుతహరి యనుపమగతి,
క్షితిని వెలుగు వీరు, చిరయశస్సును గాంచు,
వంశవృద్ధి చెంది వరలగలరు
కావ్యభర్త
ఊలపల్లి సాంబశివరావు లలితాంబ దంపతులు.
👇🏻
ఆ.వె. ఊలపల్లివంశ శ్రీలలితాంబయున్
సాంబశివులు ధరను సకల శుభులు,
భాగవతసుగణన వాసిగాంచినవారు
రాఘవాఖ్య శతక రమణులరయ.
జైహింద్.
Print this post
వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.