జైశ్రీరామ్.
ఆదరణ మేది?నాకని!అమ్మా! జగదాంబ మాతా!అదరకు మనము నందున్!
బాధిలకు కాల తీరుకు!పమ్మెం కలి మాయ నెంచన్!వదలకు కఠిను లెల్లన్!!
నీదరిని సత్య మున్నది!నె మ్మోము సు భూతి నొప్పన్!నిధి నిలయవు సుథీవే!
మోదమును భావి నొందెదు!ముమ్మాటికి శోభ నీదే?ముదిత సుగుణ వరాశ్రీ!
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృ తి,
ఛందము లోనిది. ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరము లకు చెల్లును.
1.గర్భగత"-ఆదరణ"-వృత్తము.
ఆదరణ మేది?నా కని!
బాధిలకు కాల తీరుకు!
నీదరిని సత్య మున్నది!
మోదమును భావి నొందెదు!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.
2,గర్భగత"లేదనకు"వృత్తము.
అమ్మా!జగదాంబ మాతా!
పమ్మెం కలి మాయ నెంచన్?
నెమ్మోము సు భూతి నొప్పన్!
ముమ్మాటికి శోభ నీదే ?
అభిజ్ఞా ఛందము నందలి"-అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.
3,గర్భగత"-కాలతీరు"-వృత్తము.
అదరకు మనము నందున్!
వదలకు కఠిను లెల్లన్!
నిధి నిలయపు సుధీవే!
ముదిత సుగుణ వరాశ్రీ!
అభిజ్ఞా ఛందము నందలి,బృహతి"ఛందము లోనిది
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.
4,గర్భగత"-నెమ్మోము"-వృత్తము.
ఆదరణ మేది?నాకని!అమ్మా!జగదాంబ మాతా!
బాధిలకు కాల తీరుకు!పమ్మెం కలి మాయ నెంచన్!
నీ దరిని సత్య మున్నది!నెమ్మోమును భూతి నొప్పన్!
మోదమును భవి నొందెదు!ముమ్మాటికి శోభ నీదే?
అణిమా"ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదము నకు"17"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.
5,గర్భగత"-జగదాంబ"-వృత్తము.
అమ్మా!జగదాంబ మాతా!ఆదరణ మేది?నాకని!
పమ్మెం కలి మాయ నెంచన్!బాధిలకు కాల తీరుకు!
నెమ్మోమును భూతి నొప్పన్!నీదరిని సత్య మున్నది!
ము మ్మాటికి శోభ నీదే?మోదమును భవి నొందెదు!
అణిమా ఛందము నందలి,అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17,అక్షరము లుండును.
యతి,9,వ యక్షరమునకు చెల్లును.
6,గర్భగత"-మాతరొ"వృత్తము.
ఆదరణ మేది?నాకని!అదరకు మనము నందున్!
బాధిలకు కాల తీరుకు!వదలకు కఠిను లెల్లన్?
నీదరిని సత్య మున్నది!నిధి నిలయపు సుధీ వే!
మోదమును భవి నొందెదు!ముదిత సుగుణ వరాశ్రీ!
అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.
7,గర్భగత"-నిత్య సత్య"-వృత్తము.
అదరకు మనము నందున్!ఆదరణ మేది?నాకని!
వదలకు కఠిను లెల్లన్!బాధిలకు కాల తీరుకు!
విధి నిలయపు సుధీ వే!నీ దరిని సత్య మున్నది!
ముదిత సుగుణ వారాశ్రీ!మోదమును భవి నొందెదు!
అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.
8,గర్భగత"-భావి సుఖ"-వృత్తము.
అమ్మా!జగదాంబ మాతా!అదరకు మనము నందున్?
పమ్మెం కలి మాయ నెంచన్!వదలకు కఠిను లెల్లన్!
నెమ్మోమును భూతి నొప్పన్!నిధి నిలయపు సుధీ వే!
ముమ్మాటికి శోభ నీదే!ముదిత సుగుణ వరాశ్రీ!
అణిమా ఛందము నందలి""అత్యష్టి ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,9,వ యక్షరమునకు చెల్లును.
9,గర్భగత"-భద్రకా"-వృత్తము.
అదరకు మనము నందున్?అమ్మా!జగదాంబ మాతా!
వదలకు కఠిను లెల్లన్!పమ్మెం కలి మాయ నెంచన్?
నిధి నిలయపు సుధీ వే!నెమ్మోమును భూతి యొప్పన్!
ముదిత సుగుణ వరాశ్రీ!ముమ్మాటికి శోభ నీదే!
అణిమా ఛందము నందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.
10,గర్భగత"-నిలయ సుధీ"-వృత్తము.
అమ్మా !జగదాంబ మాతా!ఆదరణ మేది?నాకని!అదరకు మనము నందున్!
పమ్మెం కలి మాయ నెంచన్!బాధిలకు కాల తీరుకు!వదలకు కఠిను లెల్లన్?
నెమ్మోమును భూతి యొప్పన్!నీదరిని సత్య మున్నది!నిధి నిలయపు సుధీ వే!
ముమ్మాటికి శోభ నీదే!మోదమును భవి నొందెదు!ముదిత సుగుణ వరా శ్రీ!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26;అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.
11,గర్భగత"-నిధి నిలయ"-వృత్తము.
ఆదరణ మేది?నాకని!అదరకు మనము నందున్!అమ్మా!జగదాంబ మాతా!!
బాధిలకు కాల తీరుకు!వదలకు కఠిను లెల్లన్?పమ్మెం కలి మాయ నెంచన్!
నీదరిని సత్య మున్నది!నిధి నిలయపు సుధీ వే!నెమ్మోమును భూతి యొప్పన్!
మోదమును భవి నొందెదు!ముదిత సుగుణ వరాశ్రీ!ముమ్మాటికి శోభ నీదే!
అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరము లకు చెల్లును.
12,గర్భగత"-అదరకు"-వృత్తము.
అదరకు మనము నందున్! ఆదరణ మేది?నాకని! అమ్మా!జగదాంబ మాతా!
వదలకు కఠిను లెల్లన్?బాధిలకు కాల తీరుకు!పమ్మెం కలి మాయ నెంచన్!
నిధి నిలయపు సుధీవే!నీ దరిని సత్య మున్నది!నెమ్మోమును భూతి యొప్పన్!
ముదిత సుగుణ వరాశ్రీ!మోదమును భవి నొందెదు!ముమ్మాటికి శోభ నీదే!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరము లకు చెల్లును.
13,గర్భగత"-వదలకు"-వృత్తము.
అమ్మా!జగదాంబ మాతా!అదరకు మనము నందున్?ఆదరణ మేది?నాకని!
పమ్మెం కలిమాయ నెంచన్!వదలకు కఠిను లెల్లన్?బాధిలకు కాల తీరుకు!
నెమ్మోమును భూతి యొప్పన్!నిధి నిలయపు సుధీ వే!నీ దరిని సత్య మున్నది!
ముమ్మాటికి శోభ నీదే!ముదిత సుగుణ వరాశ్రీ!మోదమును భువి నొందెదు!
అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరము లకు చెల్లును.
14,గర్భగత"-శోభినీ"-వృత్తము.
అదరకు మనము నందున్?అమ్మా!జగదాంబ మాతా!ఆదరణ మేది?నాకని!
వదలకు కఠిను లెల్లన్?పమ్మెం కలి మాయ నెంచన్!బాధిలకు కాల తీరుకు!
నిధి నిలయపు సుధీ వే?నెమ్మోమును భూతి యొప్పన్!నీ దరిని సత్య మున్నది!
ముదిత గుణ వరాశ్రీ!ముమ్మాటికి శోభ నీదే!మోదమును భువి నొందెదు!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,26,అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.