గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, మార్చి 2024, గురువారం

దహనాళి, సాహస,భావనా,కటిలురు,గోవ్రాజ,జవత,చరిత,ధురిత,ధక్షక,రక్షమా,హృద్రోగద్రోలుమ,ఆవిఠ్భాన,భావార్ధక,గర్భ,సార సంసార,వృత్తము.రచన,వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

 జైశ్రీరామ్.

మహి ఘల్లేశ పరం తపా ! మావిర్భావ తేజోనిధీ!మారక్షీవే!శంకరా! 
 బహు దాక్షిణ్య గుణాలయా!భావార్ధుబు నీనామమే!వారించు హృద్రోగాలన్నిటిన్!
కుహనాళిం హరియిం పవా!గోవిందుడ వీవే గదా!ఘోరాల నేరాలుం ద్రోలుమా!
సహనంబేర్చి జనాళికిన్!జవంబుం తపో నిష్టతన్!సారంబు సంసారమే యనన్? 

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి అవిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము నందలిది,ప్రాసనియమము కలదు,పాడమునకు "26:"అక్షరము 
లుండును,యతులు"10,18,అక్షరములకు చెల్లును,

1.గర్భగత"దహనాళి"-వృత్తము,

మహి మల్లేశ పరంతపా!
బహుదాక్షిణ్య గుణాలయా! 
కుహనాళిం హరి యింపవా?
 సహనం బేర్చి జనాళికిం?

అభిజ్ఞూ చుదము నందలి "బృహతి చందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

2,గర్భగత"సహనా"వృత్తము,

మావిర్భావ తెజో నిధీ!
భావార్ధంబు నీ నామమే!
గోవిందుడ వీవే గదా!
జనంబుం తపో నిష్టన్!

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"ఛుదము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు 8,అక్షరము లుండును,

3.గర్భగత"భావనా"వృత్తము,

మారక్ష దక్షీవే శంకరా!
వారించు హృద్రోగా లన్నిటిన్!
ఘోరాల నేరాలుం ద్రోలుమా!
సారంబు సంసారం బే యనన్?

అభిజ్ఞా ఛుదము నుదలి"బృహతి ఛుధము లోనిది,
ప్రావనియమము కలదు,పాదమునకు"9,అక్షరము లుండును,


4.గర్భగత"కుటిలుర"వృత్తము,

మహి మల్లేశ పరంతపా!మావిర్భావ తేజోనిధీ!
బహు దాక్షిణ్య గుణా లయా!భావార్ధంబు నీ నామమే!
కుహనాళిం హరి యింపవా?గోవిందుడ వీవే గదా!
 సహనం బేర్చె జనాళికిం!  జవంబుం తపో నీష్టన్!

అణిమా ఛుదము నందలి"అత్యష్టి,ఛుదము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17,అక్షరము లుండును,
యతి 10.వ యక్షరమునకు చెల్లును,

5.గర్భగత"గో వ్రాజం"వృత్తము,

మావిర్భావ తేజో నిధీ!మహి మల్లేశ పరంతపా!
భావార్దంబు నీ నామమే!బహుదాక్షిణ్య గుణాలయా!
గోవిందుడ వీవే గదా!కుహనాలళిం హరి యింపవా?
జవంబుం తపో నిష్టన్?సహనం బేర్చి జనాళికిన్!

అణిమా చందము నందలి"-అత్యష్టి"ఛూదము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9,వ యక్షరమునకం చెల్లును,

6"గర్భగత"జగతా"వృత్తము,

మహి మల్లేశ పరంతపా!మారక్ష దక్షీవే శంకరా!
బహు దాక్షిణ్య గుణా లయా!వారించు హృద్రోగా లన్నిటిన్!
 కుహనాళిం హరి యింపవా!ఘోరాలు నేరాలుం ద్రోలు మా!
సహనం బేర్చి జనాళికిం!సారంబం సుసారమే యనన్?

అణిమా చందము నందలి"ధృతి  ఛుదము లోనిది
ప్రాసనియమము కలదు,పాదమునకు"18."అక్షరములుండును,
యతి"10,వయక్షరమునకు చెల్లును,

7"గర్భగత"చరితా"వృత్తము,

మా రక్ష దక్షీవే శంకరా!మహి మల్లేశ పరంతపా!
వారించు హృద్రోగా లన్నిటిన్!బహు దాక్షిణ్య గుణాలయా!
ఘోరాలు నేరాలుం ద్రోలుమా!కుహనాళిం హరియింపవా!
సారంబుసంసామే యనన్?సహనం బేర్చి జనాళికిన్!

అణిమా ఛుదము నందలి ధృతి  ఛుదము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"18"అక్కరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

8,గర్భగత"దురిత"వృత్తము,

మావిర్భావ తేజోనిధీ!మా రక్ష దక్షీవే శంకరా!
భావార్ధంబు నీ నామమే!వారించు హృద్రోగా లన్నిటిన్!
గోవిందు డీవే గదా!ఘోరాల నేరాలం ద్రోలుమా!
జవంబుం తపో నిష్టలన్!సారంబు సంసారంబే యనన్?

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛుదము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు,17.అక్షరము లుండును,
యతి,9.వ యక్షరమునకు చెల్లును,

9,గర్భగత"దక్షక"వృత్తము,

మా రక్ష దక్షీవే శంకరా!మావిర్భావ తేజో నిధీ!
వారించు హృద్రోగా లన్నిటిన్!భావార్ధంబు నీ నామమే!
ఘోరాల నేరాలుం ద్రోలుమా!గోవిందు డీవే గదా?
సారంబు సంసారంబే యనన్?జవంబుం తపోనిష్టలన్!

అణిమా ఛందము నందలీ"అత్యష్టీ"ఛుదము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరములుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

10.గర్భగత"రక్షమాం"వృత్తము,

మావిర్భావ తేజోనిధీ!మహి మల్లేశ పరంతపా!మా రక్ష రక్షీవే శంకరా!
భావార్థంబు నీనామమే!బహుదాక్షిణ్య గుణాలయా!వారించు హృద్రోగా లన్నిటిన్!
గోవిందు డీవేగదా!కుహనాళిం హరియింపవా?ఘోరాల నేరాలం ద్రోలుమా!
జవంబుం తపోనిష్టలన్!సహనం బేర్చి జనాళిన్!సారంబు సంసారంబే యనన్?

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు 26,అక్షరములుండును,
యతులు"9,18,అక్షరములకు చెల్లును,

11.గర్భగత"హృద్రోగ"వృత్తము ,

మహి మల్లేశ పరంతపా!మా రక్ష దక్షీవే?శంకరా!మావిర్భావ తేజోనిథీ!
బహు దాక్షిణ్య గుణా లయా!వారించు హృద్రోగా లన్నిటిన్!!భావార్థంబు నీ నామమే!
కుహనాళిం హరి యింపవా?ఘోరాల నేరాలం ద్రోలుమా!గోవిందు డీవే గదా!
సహనం బేర్చి జనాళినిన్!సారంబు సంసారంబే యనన్?జవంబుం చపోనిష్టలన్!

అనిరుద్థందము నందలి ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదము నకు 26.అక్షరము లుండును,
యతులు,10.19,అక్షరములకు చెల్లును,

12,గర్భగత"-త్రోలుమా"వృత్తము,

మా రక్ష దక్షీవే శంకరా!మహి మల్లేశ పరంతపా!మా విర్భావ తేజో నిథీ!
వారించు రోగా లన్నిటిన్!బహు దాక్షిణ్య గుణాలయా!భావార్ధంబు నీ నామమే!
ఘోరాల నేరాలం ద్రోలుమా!కుహనాళిం హరియింపవా?గోవిందు డీవే గదా!
సారంబు సంసారంబే యనన్!సహనం బేర్చి జనాళినిన్! జవంబుం దపో నిష్టలన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19.అక్షరములకు చెల్లును,

13,గర్భగత"ఆవిర్భావ"వృత్తము,

మావిర్భావ తేజోనిథీ!మా రక్ష రక్షీవే శంకరా!మహి మల్లేశ పరంతపా!
భావార్థంబు నీ నామమే!వారించు రోగా లన్నిటిన్! బహు దాక్షిణ్య గుణా లయా!
గోవిందు డీవే గదా?ఘోరాల నేరాలం ద్రోలుమా!కుహ నాళిం హరియింపవా?
జవంబుం దపోనిష్టలన్!సారంబు సంసారంబే యనన్!సహనంబేర్చి జనాళినిన్!

అనిరుద్ఛంము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు"9,18"అక్షరములకు చెల్లును,

14,గర్భగత"'భావార్ధక"వృత్తము,

మారక్ష దక్షీవే శంకరా!మావిర్భావ తేజోనిథీ!మహి మల్లేశ పరంతపా!
వారించు రోగా లన్నిటిన్!భావార్ధంబు నీ నామమే!బహుదాక్షిణ్య గుణాలయా!
ఘోరాల నేరాలం ద్రోలుమా!గోవిందు డీవే గదా?కుహనాళిం హరియింపవా?
సారంబు సంసారంబే యనన్?జవంబుం తపోనిష్టలన్!సహనంబేర్చి జనాళిన్!

అనిరుద్ఛందము వందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.