గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, మార్చి 2024, ఆదివారం

మూకం కరోతి వాచాలం, ... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  మూకం కరోతి వాచాలం, పంగుం లంఘయతే గిరిమ్ 

యత్కృపా తమహం వందే పరమానందమాధవమ్!

తే.గీ.  మూగవానిచే పలికించు ముచ్చటగను,

కుంటివానిని నడిపించు కొండపైకి,

యేకృపారాశి చేసెడునిట్టు లేను

నాకృపామూర్తికిన్ మ్రొక్కి యభినుతింతు.

భావము. "ఎవ్వరి కృప మూగవానికి అద్భుతంగా మాటలిచ్చి, కుంటువానిని 

కొండలు దాటిస్తుందో, ఆ పరమానంద మాధవునికి వందనం!”

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.