గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, మార్చి 2024, శనివారం

యస్త్వమిత్రేణ సన్దధ్యాత్ .... మేలిమి బంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్.

 శ్లో. యస్త్వమిత్రేణ సన్దధ్యాత్  - మిత్రేణ చ విరుద్ధ్యతే|

అర్థయుక్తిం సమాలోక్య  - స మహద్విన్దతే ఫలమ్||

తే.గీ.  అర్థయుక్తిని యోచించి స్వార్థమునను

రిపునితో సంధి, సఖునితో ప్రీతి దూరుఁ

డగుచు వర్తించు నతనికి నమరునెపుడు

మంచి ఫలితముల్, సత్యంబునెంచి చూడ.

తా. ఎవరు ప్రయోజనలాభాన్ని గమనించి శత్రువుతో సంధిని, 

మిత్రుడితో విరోధాన్ని ఏర్పరుచుకుంటాడో వాడు మంచిఫలితాన్ని 

పొందుతాడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.