జైశ్రీరామ్.
కుల జాఢ్యం మత జాఢ్యం!కూల్చె సామ్యవాద మిద్ధరన్!కొల్లగొట్టి దేశ సౌరులన్!
బల దీప్తుల్ ప్రభవిల్లెన్!పల్చ నాయె జీవ భ్రాంతియున్!వ్రాలె నేల శాంతి దాంతులే!
విలు వేదీ?వెల లేదే?పిల్చి స్వార్ధ నాతి నంటిరే!బేల వైతి వేల?లోకమా!
కలిదోషం మితి మీరెన్!కల్చె గుండె భీతి చేతనన్!కాల మెట్లు?తీరునో యనన్!
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"-అనిరుద్ఛందాంతర్గత"-ఉత్ కృతి"
ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు "26"అక్షరము లుండును.
యతులు"9,18,అక్షరము లకు చెల్లును.
1,గర్భగత"-కలి దోష"-వృత్తము.
కుల జాఢ్యం మత జాఢ్యం!
బల దీప్తుల్!ప్రభ విల్లెన్!
విలు వేదీ?వెల లేదే!
కలి దోషం మితి మీరెన్!
అభిజ్ఞా ఛందము నందలి"- అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.
2,గర్భగత"-ప్రభల"-వృత్తము.
కూల్చె సామ్యవాద మిద్ధరన్
పల్చ నాయె జీవభ్రాంతియున్!
పిల్చి స్వార్ధ నాతి నంటిరే?
కల్చె గుండె భీతి చేతనన్!
అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.
3,గర్భగత"-వెలుంగు"-వృత్తము.
కొల్లగొట్టి దేశ సౌరులన్!
వ్రాలె నేల శాంతిదాంతులే?
బేల వైతి వేల?లోకమా!
కాల మెట్లు?తీరునో యనన్!
అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.
4,గర్భగత"-సమ తేదీ?"వృత్తము
.కుల జాఢ్యం మత జాఢ్యం!కూల్చె సామ్యవాద మిద్ధరన్!
బల దీప్తుల్!ప్రభ విల్లెన్!పల్చ నాయె జీవ భ్రాంతి యున్!
విలు వేదీ?వెల లేదే!పిల్చి స్వార్ధ నాతి నంటిరే?
కలి దోషం మితి మీరెన్!కల్చె గుండె భీతి చేతనన్!
అణిమా"-ఛందము నందలి "-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు పాదమునకు"17"అక్షరము లుండును..
యతి"109' వయక్షరమునకు చెల్లును.
5,గర్భగత"-జీవ భ్రాంతి"-వృత్తము.
కూల్చె సామ్యవాద మిద్ధరన్?కుల జాఢ్యం మత జాఢ్యం!
పల్చ నాయె!జీవభ్రాంతియున్!బల దీప్తుల్!ప్రభవిల్లెన్!
పిల్చి స్వార్ధ నాతి నంటిరే?విలు వేదీ?వెల లేదే!
కల్చె గుండె భీతి చేతనన్!కలి దోషం మితి మీరెన్!
అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.
6,గర్భగత"-నేల వాలు"-వృత్తము.
కుల జాఢ్యం మత జాఢ్యం!కొల్ల గొట్టె దేశ సౌరులన్?
బల దీప్తుల్ ప్రభవిల్లెన్?వ్రాలె నేల శాంతి దాంతులే?
విలువేదీ?వెల లేదే!బేల వైతి వేల?లోకమా!
కలి దోషం మితి మీరెన్!కాల మెట్లు?తీరునో యనన్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9 ,వ యక్షరము నకు చెల్లును.
7,గర్భగత"-స్వార్ధ నాతి"-వృత్తము.
కొల్లగొట్టి దేశ సౌరులన్?కుల జాఢ్యం మత జాఢ్యం!
వ్రాలె నేల శాంతి దాంతులే!బల దీప్తుల్!ప్రభవిల్లెన్?
బేల వైతి వేల?లోకమా!విలు వేదీ?వెల లేదే!
కాల మెట్లు తీరునో?యనన్!కలి దోషం మితి మీరెన్!
అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరము నకు చెల్లును.
8,గర్భగత"-మితి మీరు"-వృత్తము.
కూల్చె సామ్యవాద మిద్ధరన్?కొల్లగొట్టి దేశ సౌరులన్?
పల్చ నాయె జీవ భ్రాంతి యున్?వ్రాలె నేల శాంతి దాంతులే?
పిల్చి స్వార్ధ నాతి నంటిరే?బేల వైతి వేల?లోకమా!
కల్చె గుండె భీతి చేతనన్!కాల మెట్లు?తీరునో యనన్!
అణిమా ఛందము నందలి"ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.
9,గర్భగత"-గుండె కల్చు"-వృత్తము.
కొల్లగొట్టి దేశ సౌరులన్?కూల్చె సామ్య వాద మిద్ధరన్?
వాలె నేల శాంతి దాంతులే?పల్చ నాయె జీవ భ్రాంతియున్?
బేల వైతి వేల?లోకమా!పిల్చి స్వార్ధ నాతి నంటిరే?
కాల మెట్లు తీరునో?యనన్!కల్చె గుండె భీతి చేతనన్!
అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరము నకు చెల్లును.
10,గర్భగత"-స్వార్ధ మతి"-వృత్తము.
కూల్చె సామ్య వాద మిద్ధరన్?కుల జాఢ్యం మత జాఢ్యం!కొల్ల గొట్టి దేశ సౌరులన్?
పల్చ నాయె జీవ భ్రాంతియున్?బల దీప్తుల్!ప్రభవిల్లెన్?వ్రాలె నేల శాంతి దాంతులే!
పిల్చి స్వార్ధ నాతి నంటిరే?విలు వేదీ?వెల లేదే!బేల వైతి వేల?లోకమా!
కల్చె గుండె భీతి చేతనన్?కలి దోషం మితి మీరెన్!కాల మెట్లు?తీరునో?యనన్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.
11,గర్భగత"-కొల్ల గొట్టు"-వృత్తము.
కుల జాఢ్యం మత జాఢ్యం!కొల్లగొట్టి దేశ సౌరులన్?కూల్చె సామ్య వాద మిద్ధరన్?
బల దీప్తుల్ ప్రభ విల్లెన్?వ్రాలె నేల శాంతి దాంతులే!పల్చ నాయె జీవ భ్రాంతియున్?
విలు వేదీ?వెల లేదే!బేల వైతి వేల?లోకమా! పిల్చి స్వార్ధ నాతి నంటిరే?
కలి దోషం మితి మీరెన్?కాల మెట్లు?తీరునో యనన్!కల్చె గుండె భీతి చేతనన్?
అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరము లకు చెల్లును.
12,గర్భగత"-అశాంతి"-వృత్తము.
కొల్లగొట్టి దేశ సౌరులన్?కుల జాఢ్యం మత జాఢ్యం!కూల్చె సామ్య వాద మిద్ధరన్?
వ్రాలె నేల శాంతి దాంతులే?బల దీప్తుల్!ప్రభ విల్లెన్?పల్చ నాయె జీవ భ్రాంతియున్?
బేల వైతి వేల?లోకమా!విలు వేదీ?వెల లేదే!పిల్చి స్వార్ధ నాతి నంటిరే?
కాల మెట్లు?తీరునో!యనన్!కలి దోషం మితి మీరెన్?కల్చె గుండె భీతి చేతనన్?
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కవదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.
13,గర్భగత"-భీతి చేతనా"-వృత్తము.
కూల్చె సామ్య వాద మిద్ధరన్?కొల్ల గొట్టి దేశ సౌరులన్?కుల జాఢ్యం మత జాఢ్యం!
పల్చ నాయె జీవ భ్రాంతి యున్?వ్రాలె నేల శాంతి దాంతులే?బల దీప్తుల్!ప్రభవిల్లెన్?
పిల్చి స్వార్ధ నాతి నంటిరే?బేల వైతీ వేల?లోకమా!విలు వేదీ?వెల లేదే!
కల్చె గుండె భీతి చేతనన్?కాల మెట్లు?తీరునో!యనన్!కలి దోషం మితి మీరెన్?
అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదము నకు"26"అక్షరము లుండును.
యతులు"10,19,అక్షరము లకు చెల్లును.
14,గర్భగత"-వెల లేని"-వృత్తము.
కొల్ల గొట్టి దేశ సౌరులన్?కూల్చె సామ్య వాద మిద్ధరన్?కుల జాఢ్యం మత జాఢ్యం!
వ్రాలె నేల శాంతి దాంతులే?పల్చ నాయె జీవ భ్రాంతి యున్?బలదీప్తుల్ ప్రభవిల్లెన్?
బేల వైతి వేల?లోకమా!పిల్చి స్వార్ధ నాతి నంటిరే?విలు వేదీ?వెల లేదే!
కాల మెట్లు తీరునో?యనన్!కల్చె గుండె భీతి చేతనన్? కలి దోషం మితి మీరెన్?
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.