గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, మార్చి 2024, సోమవారం

విచిత్ర పద్యాలు - వాటి అర్ధాలు | విలోమ పద చాటువులు | ..... శ్రీ వడలి వేంకట అనంతరామ్.

జైశ్రీరామ్.

 సీ.  పార్థ శంకరు లేల పై కొని పెనగిరి? (కిరికి)

పతిబాసి ఛాయ యే పగిది నుండె? (బడబ)

చింతాకు చిగురున చెలఁగిన రుచి యేది? (పులుపు)

స్త్రీ ప్రౌఢతను చాటి చెప్పనేది? (కులుకు)

తపసుచే నేమిటి తాను సాధించును? (మహిమ)

ధర్మ వ్యాధుదెవరు ధరణి లోన? (కటిక)

అతివ కందము నిచ్చునది యేది ధరలోన? (వలువ)

జీవంతి యని దేనిఁ జెప్పు చుండ్రు? (కరక)

తే.గీ.  అన్నిటికి చూడ మూడేసి యక్షరములు 

నీవ లావల చూచిన ఏకవిధము 

చిత్త భవ భంగ శివలింగ చిన్మయాంగ

వృషతు రంగ శుభాంగ గౌరీశ లింగ.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.