గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, మార్చి 2024, ఆదివారం

యథైకేన న హస్తేన .... మేలిమి బంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్. 

శ్లో.  యథైకేన న హస్తేన  -  తాలికా సంప్రపద్యతే |

తథోద్యమపరిత్యక్తం  -  కర్మనోత్పాద్యతే ఫలమ్ ||

తే.గీ.  చప్పటుల్ గొట్ట నొకచేత నొప్పనటులె

ఉద్యమించక కార్యమ్ము లొసగవెపుడు

సత్ఫలంబులన్, గావున సాధనకయి

కలిసిపనిచేయు డందరున్, ఘనతరముగ.

భావము.  ఒకే చేయితో చప్పట్లు ఎలా కొట్టలేమో అలాగే ఉద్యమించనిదే 

(కృషి చేయనిదే) కర్మ ఫలమీయజాలదు. 

జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.