గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, మార్చి 2024, గురువారం

సత్కృతము,విలోకనా,అధర్మక,రక్షితమగు,కృశిత,విభూతి,గర్భ"-తారాస్థాయి"-వృత్తము ... రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్. 

తారా స్థాయిని జేరె మాయల్!ధర్మం బేగె! న దేడకో?తమి మిట్టాడె నీతి నీమాల్!

నేరాలే!పరి పోషణాయెన్!నిర్మానుష్య జగంబవన్!నిమిరెం!దుష్కరంబు ప్రీతిన్!
మారేనా?కలి దుష్కృతంబుల్!మార్మోగెం విష ప్రజ్ఞలున్!మమకారాశ్రితం బదేయై!
గౌరీ నాధుడు!కాచి తీరున్!కర్మంబే!సుకృతం బవన్!కమనీయంబగు విభూతిన్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును..
యతులు,10,18,అక్షరము లకు చెల్లును.

1,గర్భగత"-నేరాలే"-వృత్తము.

తారా స్థాయిని జేరె మాయల్!
నేరాలే!పరి పోష ణాయెన్!
మారేనా?కలి దుష్కృతంబుల్!
గౌరీ నాధుడు కాచి తీరున్?

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

2,గర్భగత"-మారేనా"-వృత్తము.

ధర్మం బేగె న దేడకో?
నిర్మానుష్య జగంబవన్!
మార్మ్రోగెన్ విష ప్రజ్ఞలున్!
కర్మంబే!సుకృతంబవన్!

అభిజ్ఞా ఛందము నందలి"-అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

3,గర్భగత'-దుష్కృత"-వృత్తము.

తమి మిట్టాడె నీతి నీమాల్!
నిమిరెం  దుష్కరంబు ప్రీతిన్!
మమ కారా శ్రితం బదేయై!1
కమనీయంబగు విభూతిన్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాస నియమము  కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

4,గర్భగత"-నిర్జన"-వృత్తము.

తారా స్థాయిని జేరె మాయల్!ధర్మం బేగె!న దేడకో?
నేరాలే!పరి పోషణాయెన్!నిర్మానుష్య జగం బవన్?
మారేనా?కలి దుష్కృతంబుల్!మార్మ్రోగెం విష ప్రజ్ఞలున్!
గౌరీ నాధుడె కాచి తీరున్!కర్మంబే?సుకృతంబవన్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టె"--ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము  లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-మార్మ్రోగు"-వృత్తము.

ధర్మం బేగె నదేడకో?తారా స్థాయిని జేరె మాయల్!
నిర్మానుష్య జగే బవన్!నేరాలే!పరిపోష ణాయెన్!
మార్మ్రోగెం విష ప్రజ్ఞలున్!మారేనా?కలి దుష్కృతంబుల్!
కర్మంబే సుకృతం బవన్!గౌరీ నాథుడె కాచి తీరున్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17,అక్షరము లుండును.
యతి"9 ,వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-నిమురు"-వృత్తము.

తారా స్థాయిని జేరె మాయల్!తమి మిట్టాడె నీతి నీమాల్!
నేరాలే పరి పోషణాయెన్!నిమిరెం దుష్కరంబు ప్రీతిన్!
మారేనా? కలి దుష్కృతంబుల్!మమకారాశ్రితం బదే యై!!
గౌరీ నాధుడె కాచి తీరున్!కమననీయంబగుం విభూతిన్!

అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-కాచితీరు"-వృత్తము.

తమి మిట్టాడె నీతి నీమాల్!తారా స్థాయిని జేరె మాయల్!
నిమిరెం దుష్కృతంబు ప్రీతిన్!నేరాలే పరి పోషణాయెన్!
మమకారాశ్రితం బదేయై!మారేనా?కలి దుష్కృతంబుల్!
కమనీయం బగుం  విభూతిన్!గౌరీ నాధుడె కాచి తీరున్!

అణిమా ఛందము నందలి"ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత""-విషప్రజ్ఞ"-వృత్తము.

 ధర్నం బేగె న దేడకో?తమి మిట్టాడె నీతి నీమాల్!
నిర్మానుష్య జగంబవన్.!నిమిరెం దుష్కృతంబు ప్రీతిన్!
మార్మ్రోగెం విష ప్రజ్ఞలున్!మమకారాశ్రితం బదే యై!
కర్మంబే సుకృతంబవన్!కమనీయం బగు విభూతిన్!

అణిమా ఛందమునందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,9,వ యక్షరమునకు చెల్లును.

9,గథ్భగత"-సకృతమ"-వృత్తము.

తమి మిట్టాడె నీతి నీమాల్!ధర్మం బేగె నదేడకో?
నిమిరెం దుష్కృతంబు ప్రీతిన్!నిర్మానుష్య జగం బవన్!
మమకారాశ్రితం బదే యై!మార్మ్రోగెం విష ప్రజ్ఞలున్!
కమనీయంబగు విభూతిన్!కర్మంబే సుకృతం బవన్?

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-విలోకనా"-వృత్తము.

ధర్మం బేగె న దేడకో?తారా స్థాయిని జేరె మాయల్!తమి మిట్టాడె నీతి నీమాల్!
నిర్మానుష్య జగంబవన్!నేరాలే పరి పోషణాయెన్!నిమిరెం దుష్కరంబు ప్రీతిన్!
మార్మ్రోగెం విష ప్రజ్ఞలున్!మారేనా?కలి దు ష్కృతంబుల్!మమకారాశ్రితం బదేయై!
కర్మంబే సుకృతంబవన్?గౌరీ నాథుడు కాచి తీరున్?కమనీయంబగు విభూతిన్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పామునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.

11,గర్భగత"-అధర్మక"-వృత్తము.

తారా స్థాయిని జేరె మాయల్!తమి మిట్టాడె నీతి నీమాల్!ధర్మం బేగె న దేడకో?
నేరాలే!పరిపోషణాయెన్!నిమిరెం దుష్కరంబు ప్రీతిన్!నిర్మానుష్య జగంబవన్?
మారేనా కలి దుష్కృతంబుల్!మమకారాశ్రితం బదే?యై!మార్మ్రోగెం విష ప్రజ్ఞలున్!
గౌరీ నాథుడు కాచి తీరున్?కమనీయంబగు విభూతిన్!కర్మంబే సుకృతంబవన్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-రక్షితమగు"-వృత్తము.

తమి మిట్టాడె నీతి నీమాల్!తారా స్థాయిని జేరె మాయల్!ధరంబేగె నదేడకో?
నిమిరెం దుష్కృతంబు ప్రీతిన్!నేరాలే?పరి పోషణాయెన్!నిర్మానుష్య జగంబవన్?
మమకారాశ్రితం బదే యై?మారేనా?కలి దుష్కృతంబుల్!మార్మ్రోగెం విష ప్రజ్ఞలున్!
కమనీయంబగు విభుతిన్!గౌరీ నాథుడు కాచి తీరున్?కర్మంబే సుకృతం బవన్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,26,అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరము లకు చెల్లును.

13,గరగత"-కృశిత"-వృత్తము.

ధర్మంబేగె నదేడకో?తమి మిట్టాడె నీతి నీమాల్!తారా స్థాయిని జేరె మాయల్!
నిర్మానుష్య జగంబవన్?నిమిరెం దుష్కృతంబు ప్రీతిన్!నేరాలే!పరిపోషణాయెన్?
మార్మ్రోగెం విష ప్రజ్ఞలున్!మమకారాశ్రితం బదే యై!మారేనా కలి దుష్కృతంబుల్?
కర్మంబే సుకృతంబవన్!కమనీయంబగు విభుతిన్!గౌరీశనాథుడు కాచి తీరున్?

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.

14,గర్భగత"-విభూతి"-వృత్తము.

తమి మిట్టాడె నీతి నీమాల్!ధర్మంబేగె న దేడకో?తారా స్థాయిని జేరె మాయల్!
నిమిరెం దుష్కృతంబు ప్రీతిన్!నిర్మానుష్య జగంబవన్?నేరాలే పరిపోషణాయెన్!
మమకారాశ్రితం బదేయై!మార్మోగెం విష ప్రజ్ఞలున్!మారేనా?కలి దుష్కృతంబుల్!
కమనీయంబగు విభూతిన్!కర్మంబే సుకృతంబవన్!గౌరీ నాథుడు కాచి తీరున్?

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరము లకు చెల్లును.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.