జైశ్రీరామ్.
మోహినీప్రియ,సమాశ్రీ,నీచజన్మ,స్థవనీయ,నీలిమా,కాలవహ్ని,అనుబంధ,తా యశ,ఫలమూల,రంజిత,గర్భ"-జరాత్రయ"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
"-జరాత్రయ"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.ర.జ.ర.జ.ర.భ.త.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం
కరోన"-బారి చిక్కినాము!కాలవహ్ని కంఠ ధారి!కందర్పహరా!సాంబ శివా!
నిరంత సేవ దేలు చుంటి!నీలిమంబు నావహించె!నిందింప!కటాక్షించు భవా!
వరంబులిచ్చు భూతనాధ!ఫాల వహ్ని భద్ర రుద్ర!బంధాలు!తెగంజేసె భువిన్!
భరింప లేము!ప్రాణ హాని!పాలిపోయె!లోక కీర్తి!బంధించి!క్రిమిన్ద్రోలు హరా!
1.గర్భగత"-మోహినీ ప్రియ"-వృత్తము.
బృహతీఛందము.జ.ర.జ.గణములు.వృ.సం.342.
ప్రాసనియమము కలదు.
కరోన బారి చిక్కి నాము!
నిరంత సేవ దేలు చుంటి!
వరంబు లిచ్చు భూతనాథ!
భరింప లేము ప్రాణహని!
2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
కాలవహ్ని!కంఠ ధారి!
నీలిమంబు నావహించె!
ఫాలవహ్ని భద్ర రుద్ర!
పాలిపోయె లోక కీర్తి!
3.గర్భగత"-నీచజన్మ"-వృత్తము.
బృహతీఛందము.త.య.స.గణములు.వృ.సం.205.
ప్రాసనియమము కలదు.
కందర్ప హరా!సాంబశివా!
నిందింప!కటాక్షించు భవా!
బంధాలు తెగన్జేసె భువిన్!
బంధించి క్రిమిన్ద్రోలు హరా!
4.గర్భగత"-స్థవనీయ"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.ర.జ.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కరోన బారి చిక్కి నాము!కాలవహ్ని కంఠధారి!
నిరంత సేవ దేలుచుంటి!నీలిమంబు నావహించె!
వరంబు లిచ్చు భూత నాథ!ఫాల వహ్ని భద్ర రుద్ర!
భరింప లేము ప్రాణ హాని!పాలిపోయె లోక కీర్తి!
5.గర్భగత"-నీలిమా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.భ.త.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాల వహ్ని కంఠ ధారి!కందర్ప హరా!సాంబ శివా!
నీలిమంబు నావహించె!నిందింప కటాక్షించు భవా!
ఫాల వహ్ని భద్ర రుద్ర!బంధాలు తెగన్జేసె భువిన్!
పాలిపోయె లోక కీర్తి!బంధించి క్రిమిన్ద్రోలు హరా!
6.గర్భగత"-కాలవహ్ని"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.భ.త.జ.ర.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాల వహ్ని కంఠ ధారి!కందర్ప హరా సాంబశివా!కరోన బారి చిక్కి నాము!
నీలిమంబు నావహించె!నిందింప కటాక్షించు భవా!నిరంత సేవ దేలుచుంటి!
ఫాల వహ్ని భద్ర రుద్ర!బంధాలు తెగన్జేసె భువిన్!వరంబులిచ్చు భూతనాథ!
పాలి పోయె లోక కీర్తి!బంధించి క్రిమిన్ద్రోలు హరా!పాలి పోయె లోక కీర్తి!
7.గర్భగత"-అనుబంధ"-వృత్తము.
ధృతిఛందము.త.య.స.జ.ర.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కందర్ప హరా!సాంబ శివా!కరోన బారి చిక్కి నాము!
నిందింప కటాక్షించు భవా!నిరంత సేవ దేలు చుంటి!
బంధాలు తెగన్జేసె భువిన్!వరంబు లిచ్చు భూత నాథ!
బంధించి క్రిమి న్ద్రోలు హరా!భరింప లేము ప్రాణ హాని!
8.గర్భగత"-తా యశ"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.య.స.జ.ర.జ.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కందర్ప హరా!సాంబశివా!కరోనబారి చిక్కినాము!కాల వహ్ని కంఠధారి!
నిందింప కటాక్షించు భవా!నిరంతసేవ దేలు చుంటి!నీలిమంబు నావహించె!
బంధాలు తెగన్జేసె భువిన్!వరంబు లిచ్చు భూతనాథ!ఫాలవహ్ని భద్ర రుద్ర!
బంధించి క్రిమిన్ద్రోలు హరా!భరింప లేము ప్రాణ హాని!పాలి పోయె లోక కీర్తి!
9.గర్భగత"-ఫలమూల"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.ర.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాల వహ్ని కంఠ ధారి!కరోన బారి చిక్కినాము!
నీలిమంబు నావ హించె!నిరంత సేవ దేలు చుంటి!
ఫాల వహ్ని భద్ర రుద్ర!వరంబు లిచ్చు భూత నాథ!
పాలిపోయె లోక కీర్తి!భరింప లేము ప్రాణ హాని!
10,గర్భగత"-రంజిత"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.ర.జ.ర.భ.త.లగ.గణములు.యతులు9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాల వహ్ని కంఠ ధారి!కరోన బారి చిక్కినాము!కందర్ప హరా!సాంబ శివా!
నీలిమంబు నావహించె!నిరంత సేవ దేలుచుంటి!నిందింప కటాక్షించు భవా!
ఫాల వహ్ని భద్ర రుద్ర!వరంబు లిచ్చు భూతనాథ!బంధాలు తెగన్జేసె భువిన్!
పాలిపోయె లోక కీర్తి!భరింప లేము ప్రాణహాని!బంధించి క్రిమిన్ద్రోలు హరా!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.