జైశ్రీరామ్.
ఆర్యులారా!
కరోనా కారణంగా ఇండ్లకే జనంతా పరిమితమవక తప్పలేదు.
ఇట్టి స్థితిలో కూడా సాహితీవేత్తలు తమ అమూల్యమయిన సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించుకొంటూ సద్వినియోగం చేసుకోవడం ఎంతో ముదావహం.
అవధాని పేఉచ్ఛక చక్రవర్తి బిరుదాంకితులయిన శ్రీ కంది శంకరయ్య గారు తమ శంకరాభరణం వాట్సప్ సమూహమునందు ప్రయోగాత్మకంగా అవధాన నిర్వహణను చేసి సఫలీకృతులవడంతో అవధాన సప్తాహం అని తే.19 - 4 - 2020 నుండి 25 - 4 - 2020 వరకు నిర్వహించి ఎందరో అవధానులకు, కవులకు, పృచ్ఛకులకు ప్రేరణనిచ్చి తన సాహితీ సేవ కొనసాగించారు.
అందులో నాచేత ౨౪ - ౪ - ౨౦౨౦ ని అవధానం చేయించారు. చిన్నప్పుడు ఉద్యోగం చేసే రోజులలోను విద్యార్థులలో సాహితీ పిపాస పెంచుట కొఱకు నేను అవధానం చేసి అవధానులచే చేయించి చూపేవాడిని.
మళ్ళీ ఇప్పుడు భక్తిసాధనం పత్రిక నిర్వాహకులు శ్రీపండరి రాధాకృష్ణ గారు ఒక అవధానం నాచేత చేయించి యూట్యూబులో ఉంచగా శ్రీ మాడుగుల అనిల్ కుమార్ గారు అన్ని పృచ్ఛక పాత్రలూ తానే వహించి నాచే ప్రయోగాత్మకంగా అవధానం చేయించగా ఇప్పుడు శ్రీ కంది శంకరయ్యగారు ప్రత్యక్షంగా వాత్శప్ లో పృచ్చకులెనిమిదిమందిని ఉంచి అవధానం చేయించారు.
ఇటువంటి సేవలు పత్రికలవారి దృష్టికి వెళ్ళగా వారు తమ పత్రికలద్వారా ఈ వార్తను పెఅసారం చేశారు. అందులో ఒక పత్రికా ప్రకటనను మీ ముందుంచుతున్నాను.
కంది శంకరయ్య గారికి ధన్యవాదాలు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.