గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, మే 2020, శుక్రవారం

శ్లోకమునకు పద్యానువాదం అనే అంశాన్ని శ్రీ పండరి రాధాకృష్ణ గారు చిత్రీకరించే ప్రయత్నంలో శ్రీ పొంగుబాల భార్గవశర్మగారిని పృచ్ఛకునిగాస్వాకరించారు. వారొసగిన శ్లోకమునకు అవధానులు పెక్కురు చేసిన అనువాదములు తిలకించండి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! అవధానాంశాలలో భాగంగా శ్లోకమునకు పద్యానువాదం అనే అంశాన్ని శ్రీ పండరి రాధాకృష్ణ గారు చిత్రీకరించే ప్రయత్నంలో
శ్రీ పొంగుబాల భార్గవశర్మగారిని పృచ్ఛకునిగాస్వాకరించారు. వారొసగిన శ్లోకమునకు అవధానులు పెక్కురు చేసిన అనువాదములు తిలకించండి.
     నా అనువాదం
 ఉదయగిరి ముపేతం భాస్కరం పద్మహస్తం
నిఖిల భువన నేత్రం దివ్యరత్నోపమేయం
తిమిరకరి మ్రుగేంద్రం బోధకం పద్మినీనాం

సురవర మఖివందే సుందరం విశ్వవంద్యం

సీ. ఉదయాద్రి శిఖరాన ముదమార ప్రభవించు
పద్మహస్తుండైన భాస్కరునకు,
భువన నేత్రుండయి బోధనుఁ గొల్పుచు పుణ్యఫలంబిచ్చు పూజ్య రవికి. 
ఘన రత్న సన్నిభ కాంతిపుంజమునకు
నారోగ్యమిచ్చెడి యదితిజునకు.
వర రత్న సన్నిభ ప్రభలతో జగతికి వెలుగులన్ బ్రసరించు వేలుపునకు.
గీ. చీకటనియెడి కరికి తా సింహమగుచు
పద్మినులకు బోధను గొల్పు భానునకును,
సుర విభాస జగద్వంద్య సుందరునకు
నంశుమాలికి భక్తితోనంజలింతు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.