గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, మే 2020, శుక్రవారం

సమాశ్రీ,భారజా,మత్తరజినీ,దుశ్చర్య,చెరుపు,పతనమౌ,రసగంథి,లెక్కయా,ఛేదిలు,రాలెనే,గర్భ"-కటుతర"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

 జైశ్రీరామ్.
సమాశ్రీ,భారజా,మత్తరజినీ,దుశ్చర్య,చెరుపు,పతనమౌ,రసగంథి,లెక్కయా,ఛేదిలు,రాలెనే,గర్భ"-కటుతర"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                       
"-కటుతర"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.స.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.

చేదు వేప కొమ్మ లెల్ల!చేరి"-కరోన"-యెండి పోయె!జీవధాత్రి లెక్క యౌనొకో?
ఛేద లేవు ఉష్ణ హంత్రి!చీరు బిరాన క్రొవ్వదేల?శ్రీ వసంత శోభ వెల్గెనే!
బూది వౌదు చేదు నంట!పోరగ పుల్పు సాయుధాన!భూవరాళి యండ  దండలన్!
బాధ లాపు పిప్ప లొప్పె!పారెదవే!పెశాచి వేగ!భావజారి మాకు రక్ష లే!

భావము:-
పూర్వలు కోరంగిగా బిల్వబడెడు దానిని నేడు కరోనా యనిరి.
కోరంగికి పిప్పలి,ఉసిరి యను నర్ధములు కలవు.అవితగ్గిన వారియందు
కరోనా విజృంభింప వచ్చును.
వేపకు చేదు వన్నె.అట్టి వేప కొమ్మలు కరోనా ధాటికి యెండుచుండెను.
వేపనే లెక్క జేయని కరోనకు మనుజు లేమాత్రము లెక్క కాదు.రక రకాల
జ్వరములను హరించు దివ్యౌషధ మైన వేపను ముమ్మాటికీ జయింపలేవు.
వేప చేదే నిన్ను వడిగా చీల్చి చెండాడును.క్రొవ్వెందులకు,వసంత శోభల
మరలా వేప చిగురించెను లే.చేదు మ్రింగిన నీవు తప్పక బూది వౌదువు.
పులుపనే సాయుధాన పోరాడగా హరించుకు పోదువు.నాయకులు మా
యండదండ లవగా,పరమేశ్వరుడు మము రక్షింపగా!నెటువంటి బాధ
నైన తొలగించు పిప్పలి మావద్ద కలదు.ఓ!పిశాచీ"-నీవు పరుగు లెత్తెదవు!

1.గర్భగత"-సమాశ్రీ "-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు
చేదు వేప కొమ్మ లెల్ల!
ఛేద లేవు ఉష్ణ హంత్రి!
బూది వౌదు చేదు నంట!
బాధ లాపు పిప్ప లొప్ప!
2.గర్భగత"-భారజా"-వృత్తము.
బృహతీఛందము.భ.ర.జ.గణములు.వృ.సం243.
ప్రాసనియమము కలదు.
చేరి కరోన"-యెండి పోయె!
చీరు బిరాన క్రొవ్వదేల?
పోరగ పుల్పు సాయుధాన!
పారెదవే!"-పిశాచి"-వేగ!
3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
జీవధాత్రి లెక్క యౌనొకో?
శ్రీ వసంత శోభ వెల్గెనే!
భూ వరాళి యండదండలన్!
భావ జారి మాకు రక్ష లే!
4.గర్భగత"-దుశ్చర్య"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.స.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చేదు వేప కొమ్మ లెల్ల!చేరి"-కరోన"-యెండి పోయె!
ఛేద లేవు ఉష్ణ హంత్రి!చీరు బిరాన క్రొవ్వ దేల?
బూది వౌదు చేదు నంట!పోరగ పుల్పు సాయుధాన!
బాధ లాపు పిప్ప లొప్ప!పారెదవే! పిశాచి వేగ!
5.గర్భగత"-చెరుపు"-వృత్తము.
ధృతిఛందము.భ.ర.జ.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చేరి "-కరోన"-యెండి పోయె!జీవ ధాత్రి లెక్క యౌనొకో?
చీరు బిరాన క్రొవ్వదేల?శ్రీ వసంత శోభ వెల్గెనే!
పోరగ పుల్పు సాయుధాన!భూ వరాళి యండదండలన్!
పారెదవే!పిశాచి వేగ!భావజారి మాకు రక్ష లే!
6.గర్భగత"-పతనమౌ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.జ.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చేరి "-కరోన"-యెండి పోయె!జీవధాత్రి లెక్క యౌనొకో?చేదు వేప కొమ్మ లెల్ల!
చీరు బిరాన!క్రొవ్వదేల?శ్రీ వసంత శోభ వెల్గెనే!ఛేద లేవు ఉష్ణ హంత్రి!
పోరగ పుల్పు సాయుధాన!భూ వరాళి యండ దండలన్!బూది వౌదు చేదు నంట!                                                 పారెదవే!పిశాచి వేగ!భావ జారి మాకు రక్ష లే!బాధ లాపు పిప్ప లొప్ప!
7.గర్భగత"-రసగంథి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జీవధాత్రి లెక్క యౌనొకో?చేదు వేప కొమ్మ లెల్ల!
శ్రీ వసంత శోభ వెల్గెనే!ఛేద లేవు ఉష్ణ హంత్రి!
భూ వరాళి యండ దండలన్!బూది వౌదు!చేదు నంట!
భావ జారి మాకు రక్ష లే!బాధ లాపు పిప్ప లొప్ప!
8.గర్భగత"-లెక్కయా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.స.జ.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జీవ ధాత్రి లెక్క యౌ నొకో?చేదు వేప కొమ్మ లెల్ల!చేరి "-కరోన యెండి పోయె!
శ్రీ వసంత శోభ వెల్గెనే!ఛేద లేవు!ఉష్ణ హంత్రి!చీరు బిరాన క్రొవ్వ దేల?
భూ వరాళి యండ దండలన్!బూది వౌదు !చేదు నంట!పోరగ పుల్పు   సాయుధాన!                                             భావజారి మాకు రక్ష లే! బాధలాపు!పిప్ప లొప్ప!పారెదవే!పిశాచి వేగ!
9.గర్భగత"-ఛేదిలు"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.ర.జ.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చేరి కరోన యెండి పోయె!చేదు వేప కొమ్మ లెల్ల!
చీరు బిరాన క్రొవ్వదేల?ఛేద లేవు ఉష్ణ హంత్రి!
పోరగ పుల్పు సాయుధాన!బూది వౌదు చేదు నంట!
పారె దవే!పిశాచి వేగ!బాధ లాపు పిప్ప లొప్ప!
10,గర్భగత"-రాలెనే"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.జ.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చేరి కరోన"-యెండి పోయె!చేదు వేప కొమ్మ లెల్ల!జీవధాత్రి లెక్క యౌ నొకో?
చీరు బిరాన క్రొవ్వదేల?ఛేద లేవు ఉష్ణ హంత్రి!శ్రీ వసంత శోభ వెల్గెనే!
పోరగ పుల్పు సాయుధాన!బూది వౌదు!చేదు నంట!భూ వరాళి యండ దండలన్!                                                 పారెదవే!పిశాచి వేగ!బాధ లాపు పిప్ప లొప్ప!భావజారి మాకు రక్ష లే!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

అజ్ఞాత చెప్పారు...

My Telugu literary knowledge is limited. Yet, when I read this poem I get the feeling that I am shooing away corona with neem twigs. I bow to the genius of this poet.
K.Sreenivasa Rao

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.