గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, మే 2020, సోమవారం

మత్తరజినీ,కమ్మని,భారవాహక,హుతవహా,తరుము,పద్మరాగ,క్రూరచేష్టిత,వాడి మయూఖ,రణమజా,పద్మ వ్యూహ,గర్భ"-హీరమ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

 జైశ్రీరామ్.
మత్తరజినీ,కమ్మని,భారవాహక,హుతవహా,తరుము,పద్మరాగ,క్రూరచేష్టిత,వాడి మయూఖ,రణమజా,పద్మ వ్యూహ,గర్భ"-హీరమ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.  జుత్తాడ.
                       
"-హీరమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.న.మ.స.య.లగ.గణములు.యతులు.
10,18.ప్రాసనియమము కలదు.వృ.సం.

చిక్కి తీవు పద్మ వ్యూహమున్!చేరువైతి మరణంబున్!జీవి"-కరోన"-దుశ్చింతనన్!                                               బక్క చిక్కి  డొక్క మాడులే!పౌరుషంబు పడిపోవున్!భావి జగంబు  దూషింప నిన్!                                               తిక్క చేష్ట మాని పొమ్మికన్!తీరిపోవు చెడు పీడన్!దేవి వరాన భూ మండలిన్!                                                       వ్రక్క లౌను నీదు రూపమున్!పౌరులంద శుభగంబుల్!పావకమౌ సు భూతిన్సదా!
                                                                 
1.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
చిక్కి తీవు పద్మ వ్యూహమున్!
బక్క చిక్కి డొక్క మాడులే!
తిక్క చేష్ట మాని పొమ్మికన్!
వ్రక్క లౌను నీదు రూపమున్!
2.గర్భగత"-కమ్మని"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.న.గగ.గణములు.వృ.సం.59.
ప్రాసనియమము కలదు.
చేరు వైతి మరణంబున్!
పౌరుషంబు పడి పోవున్!
తీరి పోవు చెడు పీడన్!
పౌరు లంద శుభగంబుల్!
3.గర్భగత"-భారవాహ"-వృత్తము.
బృహతీఛందము.భ.ర.ర.గణములు.వృ.సం.151.
ప్రాసనియమము కలదు.
జీవి"-కరోన"-దుశ్చింతనన్!
భావి జగంబు దూషింపగన్!
దేవి వరాన భూ మండలిన్!
పావకమౌ!సు భూతి న్సదా!
4.గర్భగత"-హుతవహా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.న.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చిక్కి తీవు పద్మ వ్యూహమున్!చేరు వైతి మరణంబున్!
బక్క చిక్కి డొక్క మాడులే!పౌరుషంబు పడి పోవున్!
తిక్క చేష్ట మాని పొమ్మికన్!తీరి పోవు చెడు పీడన్!
వ్రక్క లౌను నీదు రూపమున్!పౌరులంద శుభగంబుల్!
5.గర్భగత"-తరుము"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.న.మ.స.య.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చేరువైతి మరణంబున్!జీవి"-కరోన"-దుశ్చింతనన్!
పౌరుషంబు పడి పోవున్!భావి జగంబు దూషింపగన్!
తీరి పోవు చెడు పీడన్! దేవి వరాన భూ మండలిన్!
పౌరు లంద శుభగంబుల్!పావకమౌ!సు భూతిన్సదా!
6.గర్భగత"-పద్మరాగ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.మ.స.య.య.జ.ర.లగ.గణములు.యతులు.
9,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
చేరు వైతి మరణంబున్!జీవి"-కరోన"-దుశ్చింతనన్!చిక్కి తీవు పద్మ వ్యూహమున్!                                               పౌరుషంబు పడి పోవున్!భావి జగంబు దూషింపగన్!బక్క చిక్కి డొక్కమాడులే!                                                   తీరి పోవు చెడు పీడన్!దేవి వరాన భూ మండలిన్!తిక్క చేష్ట మాని పొమ్మికన్!                                                     పౌరు లంద శుభగంబుల్!పావకమౌ సు భూతి న్సదా!వ్రక్క లౌను నీదు రూపమున్!
                                                                     
7.గర్భగత"-క్రూర చేష్టిత"-వృత్తము.
ధృతిఛందము.భ.ర.ర.ర.జ.ర.గణములు.యతి10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జీవి"-కరోన"-దుశ్చింతనన్!చిక్కి తీవు పద్మ వ్యూహమున్!
భావి జగంబు దూషింపగన్!బక్క చిక్కి డొక్క మాడు లే!
దేవి వరాన భూ మండలిన్!తిక్క చేష్ట మాని పొమ్మికన్!
పావకమౌ సు భూతి న్సదా!వ్రక్క లౌను నీదు రూపమున్!
8.గర్భగత"-వాడిమయూఖ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.ర.ర.జ.ర.ర.న.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జీవి"-కరోన"-దుశ్చింతనన్!చిక్కి తీవు పద్మ వ్యూహమున్!చేరు వైతి మరణంబున్!                                               భావి జగంబు దూషింపగన్!బక్క చిక్కి డొక్క మాడు లే!పౌరుషంబు  పడిపోవున్!                                                 దేవి వరాన భూమండలిన్!తిక్కచేష్ట మాని పొమ్మికన్!తీరిపోవు! చెడు పీడన్!                                                       పావకమౌ!సు భూతి న్సదా!వ్రక్కలౌను నీదు రూపమున్!పౌరులంద శుభగంబుల్!
                                                               
9.గర్భగత"-రణమజా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.న.మ.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చేరువైతి మరణంబున్!చిక్కి తీవు పద్మ వ్యూహమున్!
పౌరుషంబు పడి పోవున్!బక్క చిక్కి డొక్క మాడు లే!
తీరి పోవు చెడు పీడన్!తిక్క చేష్ట మాని పొమ్మికన్!
పౌరు లంద శుభగంబుల్!వ్రక్క లౌను నీదు రూపమున్!
10,గర్భగత"-పద్మవ్యూహ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.మ.జ.ర.య.స.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చేరువైతి మరణంబున్!చిక్కితీవు పద్మ వ్యూహమున్!జీవి "-కరోన"- ! దుశ్చింతనన్!                                             పౌరుషంబు పడిపోవున్!బక్క చిక్కి డొక్క మాడు లే!భావి జగంబు దూషింపగన్!                                                   తీరిపోవు చెడు పీడన్!తిక్క చేష్ట మాని పొమ్మికన్!దేవి వరాన ! భూమండలిన్!                                                     పౌరు లంద శుభగంబుల్!వ్రక్కల లౌను నీదు రూపమున్!పావకమౌ! సు భూతి న్సదా!
స్వస్తి.
మూర్తి,జుత్తాడ.
 జహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.