జైశ్రీరామ్
శ్లో. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః |
భీష్మమేవాభిరక్షన్తు భవన్తః సర్వ ఏవ హి ||1-11||
కం. మీరలువ్యూహములన్నిట
మీరక మీ స్థానములనుమెలగుచు భీష్మున్
నేరుపుతో రక్షింపుడు
చేరగసద్విజయ పథముశ్రీమంతముగా.
భావము.
అన్ని ఎత్తుగడలలోను మీరంతా ఎవరి స్థానాలలో వాళ్ళుంటూ, సదా
భీష్ముణ్ణే రక్షించాలి
శ్లో. తస్య సఞ్జనయన్హర్షం కురువృద్ధః పితామహః |
సింహనాదం వినద్యోచ్చైః శఙ్ఖం దధ్మౌ ప్రతాపవాన్ ||1-12||
కం. అతనికి హర్షము గూర్చుచు
పితామహుఁడు సుప్రతాప వీరుఁడు భీష్ముం
డతులిత శంఖానాదము
క్షితి,కురువృద్ధుండు చేసె కీర్తిప్రసదుఁడై.
భావము.
అతడికి హర్షం కలిగిస్తూ ప్రతాపవంతుడైన కురు వృద్ధుడు గట్టిగా
సింహగర్జన చేసి శంఖం ఊదాడు.
జై శ్రీరామ్
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.