గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జనవరి 2019, శనివారం

సర్వథా వ్యవహర్తవ్యం . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. “సర్వథా వ్యవహర్తవ్యం 
కుతో హ్యవచనీయతా |
యథా స్త్రీణాం తథా వాచాం
సాధుత్వే దుర్జనో జనః ” ||(ఉ.రా.చ.)
తే.గీ. స్త్రీలు మృదువుగా పలుకుచో బేలలంచు
లోకువగచూతురెల్లరున్ లోకమునను.
కర్కశులయెడ కఠినవైఖరిని మెలగి
తమను తామె కాపాడుకో తగును స్త్రీలు. 
భావము.స్త్రీలు మృదుప్రవర్తన కలిగి, మెత్తగా మాట్లాడితే సాధారణమానవులైనా దౌష్ట్యం ప్రదర్శిస్తారు. అందువలన లోకంలో స్త్రీలు కాఠిన్యం వహించి ప్రవర్తించడం మేలుచేస్తుంది.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిజమే మమచితనానికి పోతే వెఱ్ఱి దానిగా జమకడతారు. కాస్త కఠినంగా ఉంటే గయ్యాళి అంటారు . నరంలేని నాలుకలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.