జైశ్రీరమ్.
శ్లో. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః |
నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ||1-9||
తే.గీ. కువలయమున శూరులున్ యుద్ధకోవిదులును,
త్యక్తజీవులై రెందరో ధరణిపైన
ప్రేమతోడ నాకొఱకని,వీరవరులు,
చూడుడందరిన్మీరలు,శుభసుఅరిత!
భావము.
ఇంకా ఎందరో యుద్ధకోవిదులైన శూరులూ, నానా శస్త్రాలను ధరించి
నాకోసం జీవితాలని త్యాగం చేశారు.
శ్లో. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ |
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ ||1-10||
తే.గీ. భీష్మ రక్షిత సైన్య మభేజ్యమనగ
కలిగె మనకు ననల్పమై, కనుఁడు మీరు,
భీమ రక్షిత సైన్య మవిస్త్రుత మటఁ
గలిగె వారికి నల్పమై, ఘన సుచరిత!
భావము.
భీష్ముని చేత రక్షింపబడే మన బలం అపరిమితమైనది. భీముని చేత
రక్షింపబడే వారి బలం పరిమితమైనది.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.