జైశ్రీరామ్.
మహాకవి శంకరంబాడి సుందరాచారి మన రాష్ట్ర గీతమైన' మా తెలుగు తల్లి'గేయ రచయిత అయిన శంకరంబాడి సుందరాచారి 1914 ఆగస్టు 10న తిరుపతిలో జన్మించారని ప్రముఖ సాహిత్య వేత్త డాక్టర్ శిరీష తెలిపారు. సర్పవరం జంక్షన్ లో బోటు క్లబ్ వాకర్స సంఘం ఆధ్వర్యంలో శంకరంబాడి సుందరాచారి జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయనది మాతృభాష తమిళమైనా తెలుగుపై ఎక్కువ మక్కువ చూపేవారని అన్నారు. చిన్ననాటి నుండి స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి అని అన్నారు. బ్రాహ్మణుడైనప్పటికీ ఆచారాలను వ్యతిరేకించి తల్లిదండ్రులను ఎదిరించి ఇల్లు వదిలి వెళ్లిపోయాడని అన్నారు. ఆయన అనేక భావ గీతాలు, స్థల పురాణాలు ,జానపద గీతాలు, ఖఒ డకావ్యాలు, గ్రంథాలు రచించాడని అన్నారు. రవీంద్రుని గీతాంజలిని తెలుగులోకి అనువదించాడన్నారు. ఆయన జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిలో కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.