జైశ్రీరామ్.
శ్లో. మౌనేన కలహో నాస్తిన మౌనం కలహేనచ
ప్రథమే సుఖమాప్నోతి
అన్యత్తు క్లేశ సంకులమ్
తే.గీ. కలహమది మౌనముననెప్డు కలుగఁబోదు.
కలహమున మౌనమెప్పుడు కలుఁగబోదు.
మొదటి దానిచే సుఖముండు, పిదప దాని
చేత క్లేశముల్ కలుగును ఖ్యాతి పాయు.
భావము.
మౌనముగా ఉన్నచో కలహము కలుగదు. కలహము వలన మౌనము కలుగదు.
మొదటిదాని చేత సుఖము ప్రాప్తించును. రెండవదానిచేత క్లేశము సంభవించును.
జైహింద్.
1 comments:
నమస్కారములు
నిజమైన నిజం చక్కగా చెప్పారు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.