గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, నవంబర్ 2018, శుక్రవారం

అతి పిన్న వయస్కుడైన అవధాని గన్నవరం లలిత్ ఆదిత్య. భాగ్యనగరాగమనమ్.

జైశ్రీరామ్.
ఆర్యులారా!
అమెరికాలో నివాసముంటున్న చిరంజీవి గన్నవరం లలిత్ ఆదిత్య
అతి పిన్న వయస్కుడైన17 వసంతాలు నిండిన సంస్కృతాంధ్రభాషలలో  అవధాని .
22 - 12 - 2018 నుండి 15 - 01 - 2019 వరకు
మన భాగ్యనగరంలోనే ఉంటున్నారు.
తండ్రి: గన్నవరం మారుతి శశిధర్
తల్లి: గన్నవరం శైలజ
జన్మదినము: 23 సెప్,2000
విద్యార్థి - Aerospace Engineering 1st year
ప్రవృత్తి: 
సంస్కృతాంధ్రసాహిత్యపఠనకవనములు, అవధానములు, సంగీతము, టెన్నీస్
బిరుదులు:
అవధానయువకిశోరము, అవధానయువశిరోమణి
లలిత్ అవధాని గురువులు:
శ్రీ మల్లాప్రగడ శ్రీనివాస్ వారు (శృంగేరి పరంపర). వారు వీనికి వేదము, వేదాంతము, పూజావిధులు, ఇత్యాదులను నేర్పుతున్నారు,మహానుభావులు.వారు లేనిదే ఇక్కడ వేదోక్తముగా దేవాలయప్రతిష్ఠాదులు జరగడము అరుదు.

వీని అవధానగురువులు  శ్రీ ధూళిపాళ మహదేవమణి వారు . అవధానమే కాక ఛందస్సు, సంస్కృతవ్యాకరణము కూడా నేర్పుతున్నారు.

వీనికి సంస్కృతములో మొదటి గురువులు రాయప్రోలు కామేశ్వర శర్మ వారు.
లలిత్ అవధాని: తెలుగు రచనలు:
హనుమద్దోర్దండశతకము, శ్రీరామషోడశి, ఆవిర్భావము(నరసింహావిర్భావఘట్టము), పర్యావరణావనము, శార్దూలవిక్రీడితము

సంస్కృతరచనలు: నారసింహనమశ్శతం, శారదాపంచవింశికా, హనుమన్నవకం, నృసింహపాదాదికేసరాంతస్తోత్రము.
ఈ లలిత్ అవధాని నివాసము అమెరికాలో.

    వీరి అవధాన గురువులకు వీనిచేత, అవధాన అష్టాపద చిరంజీవి సందీప్ శర్మ చేత జంటావధానము చేయించవలెనని కోరిక.
ఇక్కడ భాగ్యనగరములో రసజ్ఞుల సమక్షంలో ఔత్సాహికులైన నిర్వాహకులెవరైనా ఈ కార్యక్రమము ఏర్పాటు చేయించే ఆలోచన ఉంటే ఇది మహదవకాశముగా మనము భావింపవచ్చును.
చూద్దాం. ఈ అవకాశాన్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటారో.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.