జైశ్రీరామ్.
గతికా,గతిమా,పరమేష్టీ ,పొరపడకు,సృతిజ్ఞాన,బు ధనుత,నీమక,భూరిగుణ,ద్వే షరహిత,సచ్ఛర,గర్భ-"బో ధామృత"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
బోధామృత వృత్తము.
ఉత్కృతిఛందము.త.న.భ.స.స.జ.త.జ. గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
ద్వేషింపకు!తలిదండ్రుల?స్థిరకీ ర్తి!గడింప నెంచు?వేదాశ్రిత జ్ఞాని!వౌచున్?
పోషింపకు మవినీతి నిల?పొరపాటుకు!తావునీకు?బోధామృ తమెల్ల!ద్రావన్?
భూషంబదె!మనుజాళికి!పురుషోత్తము! మెచ్చనొప్పు!బూదే!పరమార్ధమెంచన్
వేషంబులు!విడిమన్నుమ!పెరలన్సరి జూడు!ముక్తి!బేధించకు?నీతిభాతి న్?
1.గర్భగత"-గీతికా"-వృత్తము.
బృహతీఛందము.త.న.భ.గణములు.వృ.సం. 445.ప్రాసగలదు.
ద్వేషింపకు!తలిదండ్రుల?
పోషింపకు!మవినీతి! నిల?
భూషంబదె?మనుజాళికి!
వేషంబులు విడి మన్నుమ?
2.గర్భగత"-గతిమా"-వృత్తము.
బృహతీఛందము.స.స.జ.గణములు.వృ.సం. 348.ప్రాసగలదు.
స్థిర కీర్తి!గడింప నెంచు?
పొరపాటుకు!తావు నీకు!
పురుషోత్తము మెచ్చ నొప్పు?
పెరలం! సరిజూడు ముక్తి!
3.గర్భగత"-పరమేష్ఠి"-వృత్తము.
అనుష్టుప్ఛందము.త.జ.గగ.గణములు. వృ.సం.45.ప్రాసగలదు.
వేదాశ్రిత జ్ఞానివౌచున్?
బోధామృతమెల్ల?ద్రావన్?
బూదే!పరమార్ధ మెంచన్?
బేధింపకు? నీతి భాతిన్!
4.గర్భగత"-పొరపడకు"-వృత్తము.
ధృతిఛందము.త.న.భ.స.స.జ.గణములు. యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ద్వేషింపకు!తలిదండ్రుల?స్థిర కీర్తి!గడింప నెంచు?
పోషింపకు మవినీతి నిల?పొరపాటుకు తావు నీకు?
భూషంబదె?మనుజాళికి!పురుషోత్తము మెచ్చనోప్పు?
వేషంబులువిడి మన్నుమ?పెరలం?సరి జూడు ముక్తి?
5.గర్భగత"-సృతిజ్ఞాన"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.జ.త.జ.గగ. గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
స్థిరకీర్తి గడింప నెంచు?వేదాశ్రిత జ్ఞాని వౌచున్?
పొరపాట్లకు!తావు నీకు?బోధామృత మెల్ల?ద్రావన్?
పురుషోత్తము!మెచ్చనొప్పు?బూదే! పరమార్ధ మెంచన్?
పెరలం!సరి జూడు?ముక్తి!బేధింపకు!నీతి భాతిన్?
6.గర్భగత"-బుధనుత"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.జ.త.జ.మ.భ.స. లల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
స్థిరకీర్తి!గడింప నెంచు?వేదాశ్రిత జ్ఞానివౌచుం?ద్వేషింపకు తలిదండ్రుల!
పొరపాట్లకు తావు నీకు?బోధామృత మెల్ల ద్రావం?పొషింపకు మవినీతిని?
పురుషోత్తము!మెచ్చనొప్పు!బూదే పరమార్ధమెంచం?భూషంబదెమనుజాళికి!
పెరలం సరిజూడు ముక్తి?బేధింపకు నీతి భాతిం?వేషంబులు విడి మన్నుమ?
7.గర్భగత"-నీమక"-వృత్తము.
అత్యష్టీఛందము.త.జ.మ.భ.స.లల. గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
వేదాశ్రిత జ్ఞానివౌచుం?ద్వేషింపకు తలిదండ్రుల!
బోధామృత మెల్ల ద్రావం?పోషింపకు మవినీతిని?
బూదే పరమార్ధ మెంచం?భూషంబదె?మనుజాళికి!
బేధింపకు నీతి భాతిం?వేషంబులు విడి మన్నుమ?
8.గర్భగత"-భూరిగుణ"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.జ.మ.భ.స.న.జ.జ. గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
వేదాశ్రిత జ్ఞానివౌచుం?ద్వేషింపకు తలిదండ్రుల!స్థిరకీర్తి గడింప నెంచు?
బోధామృత మెల్ల ద్రావం?పోషింపకు మవినీతిని?పొరపాట్లకు తావునీకు?
బూదే!పరమార్ధమెంచం?భూషంబదె!మను జాళికి!పురుషోత్తము మెచ్చనొప్పు
బేధింపకు నీతిభాతిం?వేషంబులువిడి!మన్నుమ? పెరలం సరిజూడు ముక్తి?
9.గర్భగత"-ద్వేషరహిత"-వృత్తము.
ధృతిఛందము.స.స.జ.త.న.భ.గణములు. యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమమగలదు.
స్థిరకీర్తి గడింప నెంచు?ద్వేషింపకు తలిదండ్రుల!
పొరపాట్లకు తావునీకు?పోషింపకు మవినీతిని?
పురుషోత్తము మెచ్చ నొప్పు?భూషంబదె!మనుజాళికి!
పెరలం సరిజూడు ముక్తి !వేషంబులు!విడి మన్నుమ?
10.గర్భగత"-సచ్ఛర"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.జ.త.న.భ.త.జ. గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
స్థిరకీర్తి గడింప నెంచు?ద్వేషింపకు తలిదండ్రుల!వేదాశ్రిత జ్ఞాని వౌచున్?
పొరపాట్లకు తావు నీకు?పోషింపకు మవినీతిని!బోధామృత మెల్లద్రావన్?
పురుషోత్తముమెచ్చనొప్పు!భూషంబదె మనుజాళికిబూదే!పరమార్ధమెంచన్?
పెరలం సరిజూడు ముక్తి?వేషంబులు విడి మన్నుమ?బేధింపకు నీతి భాతిన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
1 comments:
నమస్కారములు
పాండితీ స్రష్ట శ్రీ వల్లభవఝులవారి గర్భ కవితా వృత్తము లన్నియు అద్భుతము గానున్నవి. శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.