జైశ్రీరామ్.
ఆర్యులారా!
శ్రీమన్నారాయణ కృపా కటాక్ష లబ్ధ పుణ్యవిశేషము శ్రీమన్నారాయణ శతక కర్తగా నన్ను చేసినది. ఆ శ్రీమన్నారాయణ శతకమునాద్యంతము చదివిన
బ్రహ్మశ్రీ చక్రాల రాజారావు కవివరులు.
శతకమునందలి
77. శా. కన్నా ! కన్నులు కల్గినట్టి ఘనులే
గర్వాంధతన్ వర్తిలన్
కన్నుల్లేని కబోదిగా పుడమిపై గాంచున్ గదా జన్మమున్.
ఎన్నంజాలరదేలనో? వలచు దుష్కృత్యంపు దుర్వృత్తి. శ్రీ
మన్నారాయణ! మార్పుకొల్పుమనఘా ! మౌఢ్యంబు పోకార్పుమా..
కన్నుల్లేని కబోదిగా పుడమిపై గాంచున్ గదా జన్మమున్.
ఎన్నంజాలరదేలనో? వలచు దుష్కృత్యంపు దుర్వృత్తి. శ్రీ
మన్నారాయణ! మార్పుకొల్పుమనఘా ! మౌఢ్యంబు పోకార్పుమా..
అను పద్య పరిశీలనానంతరము
ఈ క్రింది విధముగ తమ అభిప్రాయమునకు అద్దము పట్టిరి
చింతావారిమనోభిరామమగుసచ్చిద్బావమందాకినీ
ప్రాంతోద్యానవనాంతసీమ రమణీయాకారపుంస్కోకిలా
స్వాంతోద్భూతమనోజ్ఞగీతగతపద్యమ్మున్స్వరైకావిధిన్
సంతోషాత్మఁబఠించితిన్ముకుళితస్వాంతాన
వందించితిన్
అటులనే
శతకమునందలి
శతకమునందలి
79. శా. కన్నా ! నీవె యనంతకృష్ణుడవు సత్
కామ్యార్థముల్ తీర్చ మీ
కున్నానంచును నన్ను చేరుదువు దీనోద్ధారకా నీవె న
న్నన్నాయంచును. నాదు భాగ్యఫలమై. యాత్మన్ ప్రదీపించు శ్రీ
మన్నారాయణ! తమ్ముడా యనుచు నిన్ మర్యాదతో పిల్వగన్.
కున్నానంచును నన్ను చేరుదువు దీనోద్ధారకా నీవె న
న్నన్నాయంచును. నాదు భాగ్యఫలమై. యాత్మన్ ప్రదీపించు శ్రీ
మన్నారాయణ! తమ్ముడా యనుచు నిన్ మర్యాదతో పిల్వగన్.
అను పద్యమునకు
హృద్యభావార్థసంబద్ధపద్యమిద్ది
భక్తితాత్పర్యసంయుక్తపద్యమిద్ది
పద్మనేత్రకృపాపాత్రపద్యమిద్ది
భవమునందంగదిక్సూచిపద్యమిద్ది.
అని తమ అభిప్రాయాన్ని వ్యక్తము చేసిరి.
అని తమ అభిప్రాయాన్ని వ్యక్తము చేసిరి.
98. శా. సున్నుండల్, వడపప్పు, బూరె, లరిసెల్, శుద్ధోదకం, బుప్పు. క్షీ
రాన్నంబున్, పులిహార , గార్లు, పుణుకుల్, యావన్మనోహార్యముల్
మున్నే నీకు తినంగ బెట్టుదుముగా. మూర్ఖత్వమా యేమి? శ్రీ
మన్నారాయణ. కొంచెమైన గొనవో? మా పిచ్చి నీకబ్బెనో ?
అను పద్యమునకు వీరు ఈ క్రింది విధముగా స్పందించిరి.
ఎన్నెన్నివంటకమ్ములొ
మున్నుగ నైవేద్యరీతి మురహరికిడుచున్
దిన్నగఁదినుమని వేడిన
నిన్నున్ మదిమెచ్చెఁదృప్తి నెక్కొనె సుకవీ!
అని తమ అభిప్రాయాన్ని వ్యక్తము చేయుటయే కాక,
అనేక సందర్భములలో దొర్లిన దోషములు సూచించి
దోషరహితముగ చేయు అవకాశమును కలిగించియున్న సహృదయులు.

అట్టి
శ్రీ చక్రాల రాజారావు కవివరులకు
నా ధన్యవాదములు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
ప్రముఖ పాండితీ స్రష్టల మన్ననలను పొందిన శ్రీ చింతా సోదరులకు నేను అక్కను కావడం నాపూర్వజన్మ సుకృతం.జన్మ జన్మ లకీ ఇలా అక్కగా మిగిలిపోవాలని ఆ భగవంతుని కోరుతూ ప్రేమతో దీవించి అక్క .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.