గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, మే 2018, శుక్రవారం

మత్తరజినీద్వయ,చీకట్లలరు;రజినీకరప్రియద్వయ,కౌతుక,కర్మకృత,శ్రమణా,పేరొనరని,గర్భనిర్మలాత్మద్వయవృత్తములు. రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.
మత్తరజినీద్వయ,చీకట్లలరు;రజినీకరప్రియద్వయ,కౌతుక,కర్మకృత,శ్రమణా,పేరొనరని,గర్భనిర్మలాత్మద్వయవృత్తములు.
రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

నిర్మలాత్మద్వయ వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.ర.య.లగ.గగణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
1.కాయకష్టమోర్వనోపరే!కౌతుకానడబ్బు!కోరుచున్కర్మదుష్కృతంబోపగన్?
బాయరేమి!స్వార్ధచింతనం?పాతుబడ్డ!కీర్తి నెంచకం?పర్మధర్మతత్వుండనన్?
శ్రీయనంతకోటి!భాస్వతం!చేతురేమి?నీచకృత్యముల్చేర్మిలేని!సత్కామ్యతన్!
నేయమందరేల?బీదలం!నీతిలేని?ఖ్యాతదేలనో?నిర్మలాత్మ లే దెంచగన్?

2.కౌతుకానడబ్బు!కోరుచుం?కాయకష్టమోర్వనోపరే?కర్మదుష్కృతంబోపగన్?పాతుబడ్డకీర్తి నెంచకం?బాయరేమి?స్వార్ధచింతనం!పర్మధర్మతత్వుండనన్?
చేతురేమి?నీచకృత్యముల్శ్రీయనంతకోటిభాస్వతం!చేర్మిలేని!సత్కామ్యతన్!నీతిలలేనిఖ్యాతదేలనో?నేయమందరేల?బీదలం?నిర్మలాత్మ!లేదెంచగన్?

శ్రీయనంతకోటిభాస్వతన్=అనంతకోటిసంపదప్రకాశమున(మితిమీరినసంపద
లవలన)


1.గర్భగత"- మత్తరజినీద్వయవృత్తములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
1.కాయకష్ట మోర్వనోపరే?             2.కౌతుకాన డబ్బు కోరుచున్?
బాయరేమి?స్వార్ధచింతనన్?            పాతుబడ్డ కీర్తి నెంచకన్?
శ్రీయనంతకోటి భాస్వతన్?               చేతురేమి?నీచకృత్యముల్?
నేయమందరేల?బీదలన్?                నీతిలేని?ఖ్యాతదేలనో?

2.గర్భగత"-చీకట్లలరు"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.య.లగ.గణములు.వృ.సం.75.ప్రాసగలదు.
కర్మదుష్కృతంబోపగన్?
పర్మధర్మ తత్పరుండనన్?
చేతురేమి?నీచకృత్యముల్?
నీతిలేని? ఖ్యాత దేలనో?

3.గర్భగత"-రజినీకరప్రియ"-ద్వయ వృత్తములు.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
1.కాయకష్టమోర్వ నోపరే?కౌతుకాన ?డబ్బు కోరుచున్?
  బాయరేమి?స్వార్ధ చింతనం?పాతుబడ్డ!కీర్తి నెంచకన్?
శ్రీయనంత కోటి భాస్వతం?జేతురేమి?నీచకృత్యముల్?
నేయమందరేల? బీదలం?  నీతిలేని?   ఖ్యాతదేలనో?

2.కౌతుకాన?డబ్బుకోరుచున్?కాయకష్టమోర్వనోపరే?
పాతుబడ్డ!కీర్తినెంచకం?బాయరేమి?స్వార్ధ చింతనన్?
చేతురేమి?నీచకృత్యముల్శ్రీయనంతకోటి భాస్వతన్?
నీతిలేని?ఖ్యాతదేలనో?నేయమందరేల?బీదలన్?

4.గర్భగత"-కౌతుక"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.య.లగ.గణములు.యతి.10.వ.యక్షరము
ప్రాసనీమముగలదు.
కౌతుకాన?డబ్బుకోరుచుం? కర్మదుష్కృతంబోపగగన్?
పాతుబడ్డ!కీర్తి నెంచకన్?పర్మధర్మ! తత్పరుండనన్?
చేతురేమి?నీచ కృత్యముల్చేర్మి లేని?సత్కామ్యతన్?
నీతిలేని?ఖ్యాతదేలనో? నిర్మలాత్మ! లే  దెంచగన్?

5.గర్భగత"-కర్మకృత"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.య.య.జ.ర.లగ.గణములు.యతి.9.వ.యక్షరము.
కర్మదుష్కృతంబోపగం?కాయకష్ట మోర్వ నోపరే?
పర్మధర్మ తత్పరుండనం?బాయరేమి?స్వార్ధ చింతనన్?
చేర్మిలేని!సత్కామ్యతం?శ్రీయనంత కోటి భాస్వతన్?
నిర్మలాత్మ! లేదెంచగం? నేయమందరేల?బీదలన్?

6.గర్భగత"-శ్రమణా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.య.య.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు10,18.ప్రాసనీమముగలదు.
కర్మదుష్కృతంబోపగం?కాయకష్టమోర్వనోపరే?కౌతుకాన!డబ్బుకోరుచున్?
పర్మధర్మ!తత్పరుండనం?బాయరేమిస్వార్ధచింతనం?పాతుబడ్డకీర్తినెంచకన్?
చేర్మిలేని!సత్కామ్యతం?శ్రీయనంతకోటి భాస్వతంచేతురేమినీచకృత్యముల్?
నిర్మలాత్మ! లే దెంచగం? నేయమందరేల? బీదలం? నీతిలేని?ఖ్యాతదేలనో?

7.గర్భగత"-పేరొనరని"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.య.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
కౌతుకాన!డబ్బుకోరుచుం?కర్మదుష్కృతంబోపగం?కాయకష్టమోర్వనోపరే?
పాతుబడ్డ!కీర్తినెంచకం?పర్మధర్మతత్పరుండనం?బాయరేమి?స్వార్ధచింతనన్?
చేతురేమి?నీచకృత్యముల్జేర్మిలేని!సత్క్మ్యతం?శ్రీయనంతకోటిభాస్వతన్?
నీతిలేని!ఖ్యాతదేలనో?నిర్మలాత్మ!లే దెంచగం?నేయమందరేల?బీదలన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
వందే భారత మాతరమ్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.