జైశ్రీరామ్.
గతికా,అనఘా,మత్తరజినీ ,నశోచయ,రేపటూహ,తావళ,సు నీతినీ,సౌరహీన,స్వభావ ,
మనుజనుతి,గర్భ"-తాడి నీ"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
"-తాడినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.న.ర.య.జ.ర.ల గగణమలులు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
పెనుగులాడ!లాభమేమి?వినయమొప్పనొ ప్పుమా?వేద భాష దూష మానుమా?
వినుతి కెక్కు మాటలాడు?వినగ నింపు సొంపగుం?వేదనంబుగూర్ప పాపమౌ
కనుము కీర్తికాంత నీవు?కనులముందు దైవమై?కాదనంగ క్షేమ దూరమౌ?
మనుము,జీవధాత్రి మెచ్చ!మనసులందు!మెల్గుమా!మాధవా! యనంగ? మోక్షమౌ!
1.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం. 344.ప్రాసగలదు.
పెనుగు లాడ లాభమేమి?
వినుతికెక్కు మాటలాడు!
కనుము కీర్తికాంత నీవు?
మనుము జీవధాత్రి మెచ్చ!
2.గర్భగత"-అనఘా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.లగ.గణములు. వృ.సం.88.ప్రాసగలదు.
వినయ మొప్ప నొప్పుమా?
వినగ నింపు సొంపగున్?
కనుల ముందు దైవమై?
మనసు లందు మెల్గుమా!
3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం. 171.ప్రాసగలదు.
వేదభాష దూష మానుమా?
వేదనంబు గూర్ప పాపమౌ?
కాదనంగ క్షేమ దూరమౌ?
మాధవా!యనంగ మోక్షమౌ?
4.గర్భగత"-నశోచయ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.న.ర.లగ. గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పెనుగులాడ లాభమేమమి?వినయ మొప్ప నొప్పుమా!
వినుతి కెక్కు మాటలాడు!వినగ నింపు సొంపగున్?
కనుము కీర్తి కాంత నీవు?కనుల ముందు దైవమై?
మనుము జీవధాత్రి మెచ్చ?మనసు లందు మెల్గుమా!
5.గర్భగత"-రేపటూహ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.య.జ.ర.లగ. గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
వినయ మొప్ప నొప్పుమా!వేదభాష దూష మానుమా?
వినగ నింపు సొంపగుం?వేదనంబు గూర్ప పాపమౌ?
కనుల ముందు దైవమై?కాదనంగ క్షేమ దూరమౌ?
మనసులందు మెల్గుమా!మాధవా!యనంగ మోక్షమౌ?
6.గర్భగత"-తావళ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.య.జ.ర.జ.స.జ.గ ల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
వినయ మొప్ప నొప్పుమా!వేదభాష దూష మానుమా?పెనుగులాడ! లాభమేమి?
వినగ నింపు సొంపగుం?వేదనంబు గూర్ప పాపమౌ?వినుతికెక్కు మాట లాడు?
కనుల ముందు దైవమై?కాదనంగ క్షేమ దూరమౌ?కనుము కీర్తికాంతనీవు?
మనసులందు మెల్గుమా!మాధవా!యనంగ మోక్షమౌ?మనుము జీవధాత్రి మెచ్చ?
7.గర్భగత"-సునీతినీ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.న.ర.జ.గణములు.య తి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
వేద దూష మానుమా!పెనుగులాడ లాభమేమి?
వేదనంబు గూర్ప పాపమౌ?వినుతికెక్కు మాటలాడు?
కాదనంగ క్షేమ దూరమౌ?కనుము కీర్తికాంత నీవు?
మాధవా!యనంగ మోక్షమౌ?మనుము జీవధాత్రి మెచ్చ!
8.గర్భగత"-సౌరహీన"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.ర.జ.న.ర.ల గ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
వేద దూష మానుమా!పెనుగులాడలాభమేమి?వినయమొ ప్ప నోప్పుమా?
వేదనంబు గూర్ప పాపమౌ?వినుతికెక్కు మాటలాడు?వినగ నింపు సొంపగున్!
కాదనంగ క్షేమ దూరమౌ?కనుము కీర్తికాంత నీవు?కనులముందు దైవమై?
మాధవా!యనంగ మోక్షమౌ?మనుము జీవధాత్రి మెచ్చ!మనసులందు మెల్గుమా?
9.గర్భగత"-స్వభావ"-వృత్తము!
అత్యష్టీఛందము.న.ర.జ.స.జ.గల.గణము లు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
వినయ మొప్ప నొప్పుమా!పెనుగులాడ లాభమేమి?
వినగ నింపు సొంపగుం?వినుతి కెక్కు మాటలాడు?
కనులముందు దైవమై?కనుము కీర్తికాంత నీవు?
మనసులందు మెల్గుమా?మనుము జీవధాత్రి మెచ్చ?
10.గర్భగత"-మనుజనీతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.స.జ.ర.జ.ర.ల గ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
వినయ మొప్ప నొప్పుమా!పెనుగులాడ లాభమేమి?వేద దూష మానుమా?
వినగ నింపు సొంపగుం?వినుతికెక్కు మాటలాడు?వేదనంబు గూర్ప పాపమౌ?
కనులముందు దైవమై?కనుము కీర్తికాంత నీవు?కాదనంగ క్షేమ దూరమౌ?
మనసులందు మెల్గుమా?మనుము జీవధాత్రి మెచ్చ?మాధవా!యనంగ మోక్షమౌ?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.