గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, మే 2018, శనివారం

మత్తరజినీద్వయ,సమానీ,రజినీకర ప్రియద్వయ, రజోరజ, శంఖారావ,

జైశ్రీరామ్.

మత్తరజినీద్వయ,సమానీ,రజినీకర ప్రియద్వయ, రజోరజ, శంఖారావ,
మింటినంటు,వరీయ జ్ఞాన,గర్భ జ్ఞాపికా ద్వయ,వృత్తములు
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.

జ్ఞాపికాద్వయ వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.ర.జ.లగ.గణములు.యతులు10,19.
ప్రాసనీమముగలదు. 

1.వెంటరాని!శ్రీలవేలనో?వే!వరీయ జ్ఞాపికెంచుమా!వేదిలంగ!మానుమిలన్?
కంటిరెప్ప!కాచు దైవమే?కావగల్గు!శ్రీధరుండులే?కాదనంగరాదు సుమా?
మింటినంటుశంఖరావతం!మీవశుండుమావశుండునై!మేథపెంచువాడు!హరే!
జంటగూర్చుభుక్తినీయుచుంసావధానపూర్ణమేర్చుగా!సాధకాలుసాధ్యమవన్!

2.వే!వరీయజ్ఞాపికెంచుమా!వెంటరానిశ్రీలవేలనో?వేదిలంగ!మానుమిలన్?
కావగల్గు!శ్రీధరుండులే?కంటిరెప్ప కాచు!దైవమే?కాదనంగరాదు?సుమా?
మీవశుండు!మావశుండునై!మింటినంటు!శంఖరావతం!మేథపెంచువాడుహరే
సావధానపూర్ణమేర్చుగా!జంటగూర్చుభుక్తినీయుచుంసాధకాలుసాధ్యమవన్?

1.గర్భగత"-మత్తరజినీద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
1.వెంటరాని!శ్రీలవేలనో?              2.వేవరీయ!జ్ఞాపికెంచుమా!
  కంటిరెప్ప!కాచుదైవమే?               కావగల్గు!శ్రీథరుండు  లే?
 మింటినంటు!శంఖరావతన్?         మీవశుండు!మావశుండునై!
 జంటగూర్చు!భుక్తి నీయుచున్?     సావధాన!పూర్వ మేర్చుగా!

2.గర్భగత"-సమానీవృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.లగ.గణములు .వృ.సం.107.ప్రాసనీమముగలదు.
వేదిలంగ!మానుమిలన్?
కాదనంగ!రాదు సుమా?
మేథ!పెంచువాడు!హరే!
సాధకాలు!సాధ్య మవన్?

3.గర్భగత"-రజినీకరప్రియ"-ద్వయ.వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
1.వెంటరాని!శ్రీలవేలనో?వే వరీయ జ్ఞాపికెంచుమా!
  కంటిరెప్ప కాచుదైవమై?కావగల్గు!శ్రీధరుండులే?
  మింటినంటు!శంఖరావతం?మీవశుండు!మావశుండునై?
  జంటగూర్చు!భుక్తినీయుచుం?సావధాన పూర్వ మేర్చుగా?

2.వేవరరీయ జ్ఞాపికెంచుమా!వెంటరాని!శ్రీలవేలనో?
   కావగల్గు!శ్రీధరుండు లే?కంటిరెప్ప కాచుదైవమై!
  మీవశుండు!మావశుండునై!మింటినంటు!శంఖరావతన్!
  సావధాన పూర్వమేర్చుగా?జంటగూర్చు!భుక్తినీయుచన్?

4.గర్భగత"-రజోరజ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.లగ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
వే వరీయ జ్ఞాపికెంచుమా?వేదిలంగ మాను మిలన్?
కావగల్గు!శ్రీధరుండులే?కాదనంగ రాదు!సుమా!
మీవశుండుమావశుండునై?మేథపెంచువాడు!హరే!
సావధానపూర్ణమేర్చుగా?సాధకాలు! సాధ్యమవన్?

5.గర్భగత"-శంఖారావ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
వేవరీయజ్ఞాపికెంచుమా?వేదిలంగమాను మిలన్?వెంటరాని!శ్రీలవేలనో?
కావగల్గు!శ్రీధరుండులే?కాదనంగరాదు సుమా!కంటిరెప్ప!కాచుదైవమై?
మీవశుండుమావశుండునై!మేథపెంచువాడుహరేమింటినంటుశంఖరావతన్
సావధానపూర్ణమేర్చుగా!సాధకాలు!సాధ్యమవం?జంటగూర్చుభుక్తిజూపుగా!

6.గర్భగత"-మింటినంటు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.య.జ.ర.లగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
వేదిలంగ!మానుమిలం?వెంటరాని!శ్రీలవేలనో?
కాదనంగరాదుసుమా?కంటిరెప్పకాచు!దైవమై?
మేధపెంచువాడు!హరే?మింటినంటు!శంఖరావతన్?
సాధకాలుసాధ్యమవం?జంటగూర్చు!భుక్తి జూపుగా?

7.గర్భగత"-వరీయజ్ఞాన"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.య.జ.ర.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
వేదిలంగమానుమిలం?వెంటరాని!శ్రీలవేలనో?వేవరీయ !జ్ఞాపికెంచుమా?
కాదనంగరాదు!సుమా!కంటిరెప్పకాచు!దైవమై?కావగల్గు!శ్రీథరుండులే?
మేథపెంచువాడుహరే!మింటినంటుశంఖరావతం!మీవశుండుమావశుండునై
సాధకాలు!సాధ్యమవం?జంటగూర్చు!భుక్తిజూపుగాసావధానపూర్ణమేర్చుగగా
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సరస్వతీ పుత్రులకు ప్రణామములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.