గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, మే 2018, మంగళవారం

జైశ్రీరామ్. అనులోమ,విలోమ,"-మత్తరజినీ"-వృత్తము రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
అనులోమ,విలోమ,"-మత్తరజినీ"-వృత్తము
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
మత్తరజినీవృత్తము.(అనులోమము)
బృహతిఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
  రామ కామరా వరామభా!
  రామి దేలె దేల?శ్రీమతా!
  కాముకార్ధ వర్ధ కా! మనా!
సామ ధీమ రామ!రామనా!
రామ=మనోహరమైన,లక్ష్మి, ఇందు వాడ బడిన' వ'-కార,'క'-కారములు వరుసగా వరుణదైవాత్మిక,ప్రజాపతి
(బ్రహ్మబీజము)వీటిస్ఫురణ వలనజలవృద్ధిగల్జగును.రా"-వశీకరణ బీజము!సర్వదైవాత్మకం(అగ్ని,జల 
బీజయుక్త వరుణ బీజము).రామభా"-మ"-కారము మదన బీజము!సర్వజయ ప్రదము.భా=కాంతి
(ప్రకాశము).ద"-కారములు దుర్గాబీజములు సర్వార్ధ సిద్ధిదములు.
విలోమ"-మత్తరజినీవృత్తము   
భామరా వరామ కామరా!
తామ శ్రీల దేలె దేమిరా?
నా మకార్ధ వర్ధ కాముకా!
నామ రామ దామ ధీమసా?                                                                                             కామ=భక్తియందు కోర్కె!తామశ్రీల=అంధకార బంధురమైన సంపదలు,మకార్ధము=యాగముకొరకు!                     స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.