గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, మే 2018, బుధవారం

వినయశ,యశోవిరాజి,భుక్తిదా,సురనుతి,చరితనిలు,మగతమి,మరువక,వరదమ,స్తుతివర,వరనుత,గర్భ"గురుతమ"-వృత్తము.రచన:శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
వినయశ,యశోవిరాజి,భుక్తిదా,సురనుతి,చరితనిలు,మగతమి,మరువక,వరదమ,స్తుతివర,వరనుత,గర్భ"గురుతమ"-వృత్తము.
రచన:వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
  జుత్తాడ.

         -" గురుతమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.స.న.న.త.న.త.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
స్తుతివర!నుత చతురా!సొగసరి!నిటలాక్షా?సురవర!మల్లేశ!ఈశా?
మతి కుదురొసగు!మయా?మగతమిగన!నీతిం?మరువక!కొల్చెండు!నన్నున్?
బ్రతికెదు!సుర నుతులం?ప్రగణిత!వరదాలం?పరచుమి!ఖ్యాతిం!ముదానన్?
సతి,సుతు,లిల!గనుతం?జగతికి!గురుతంబై?చరితను!నిల్వంగ!సోమా?

1.గర్భగత"-వినయశ"-వృత్తము.
బృహతీఛందము.న.న.స.గణములు.వృ.సం.256.ప్రాసగలదు.
స్తుతి వర!నుత చతురా?
మతి!కుదురొసగు! మయా
బ్రతికెదు!సుర నుతులం?
సతి,సుతు,లిల గనుతన్?

2.గర్భగత"-యశోవిరాజి"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.న.గగ.గణములు.వృ.సం.64.ప్రాసగలదు.
సొగసరి!నిటలాక్షా?
మగతమి గన నీతిన్?
ప్రగణిత!వరదాలం?
జగతికి!గురుతంబై?

3.గర్భగత"-భుక్తిదా"-వృత్తము.
బృహతీఛందము.న.య.య.గణములు.వృ.సం.80.ప్రాసగలదు.
  సురవర!    మల్లేశ!    ఈశా?
మరువక!గొల్చెండు!నన్నున్?
పరచుమి!ఖ్యాతిం!బుధానం?
చరితను!నిల్వంగ!సోమా!

4.గర్భగత"-సురనుతి"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.స.న.న.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
స్తుతివర!నుత చతురా!సొగసరి!నిటలాక్షా?
మతి కుదురొసగు!మయా?మగతమి కన నీతిం?
బ్రతికెదు!సుర నుతులం?ప్రగణిత!వరదాలం?
సతి,సుతు,లిల గనుతం?జగతికి!గురుతంబై?

5.గర్భగత"-చరిత నిలు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.త.న.త.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సొగసరి!నిటలాక్షా?సురవర!మల్లేశ!ఈశా?
మగతమి!గన!నీతిం?మరువక!గొల్చెండు!నన్నున్?
ప్రగణిత!వరదాలం?పరచుమి!ఖ్యాతిం!బుధానన్?
జగతికి!గురుతంబై?చరితను!నిల్వంగ!సోమా?

6.గర్భగత"-మగతమి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.త.న.త.న.న.లగ.గణములు.యతులు9,18.
ప్రాసనీమముగలదు.
సొగసరి!నిటలాక్షా?సురవర!మల్లేశ!ఈశా?స్తుతివర!నుత చతురా?
మగతమిగన!నీతిం?మరువక!గొల్చెండు!నన్నుం?మతికుదురొసగుమయా?
ప్రగణిత!వరదాలం?పరచుమి!ఖ్యాతిం?బుధానం!బ్రతికెదు!సురనుతులం?
జగతికి!గురుతంబై?చరితను!నిల్వంగ!సోమా?సతి,సుతులిల!గనుతన్?

7.గర్భగత"-మరువక"-వృత్తము.
ధృతిఛందము.న.య.య.న.న.స.గణములుుయతి.10.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
సురవర!మల్లేశ!ఈశా?స్తుతివర!నుత!చతురా?
మరువక!గొల్చెండు!నన్నుం?మతికుదురొసగు మయా!
పరచుమి!ఖ్యాతిం?బుధానం?బ్రతికెదు!సురనుతులం?
చరితను!నిల్వంగ!సోమా!సతి,సుతు,లిల,గనుతం?


8.గర్భగత"-వరదమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.య.య.న.న.స.న.న.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
సురవర!మల్లేశ!ఈశా?స్తుతివర!నుత!చతురా?సొగసరి!నిటలాక్షా?
మరువక!గొల్చెండు!నన్నుం?మతికుదురొసగుమయా!మగతమిగన!నీతిం?
పరచుమి!ఖ్యాతిం?బుధానం!బ్రతికెదు!సురనుతులం?ప్రగణిత!వరదాలం?
చరితను!నిల్వంగ?సోమా!సతి,సుతు,లిల,గనుతం?జగతికి!గురుతంబై?

9.గర్భగత"-స్తుతివర"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.త.న.న.లగ.గణములు.యతి.9.వ.యక్షరము
.సొగసరి!నిటలాక్షా?స్తుతివర!నుత చతురా?
మగతమిగన!నీతిం?మతికుదురొసగుమయా?
ప్రగణిత!వరదాలం?బ్రతికెదు!సురనుతులం?
జగతికి!గురుతంబై?సతి,సుతు,లిల,గనుతం?

10.గర్భగత"-వరనుత"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.త.న.న.జ.న.త.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
సొగసరి!నిటలాక్షా?స్తుతివర!నుత చతురా?సురవర!మల్లేశ!ఈశా?
మగతమి!గన!నీతిం?మతికుదురొసగు మయా?మరువక!గొల్చెండు!నన్నుం?
ప్రగణిత!వరదాలం?బ్రతికెదు!సురనుతులం?పరచుమి!ఖ్యాతిం!బుధానం?
జగతికి!గురుతంబై?సతి,సుతు,లిల,గనుతం?చరితను!నిల్వంగ!సోమా?
స్వస్తి..


మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సరస్వతీ పుత్రులకు శత వందనములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.