జైశ్రీరామ్.
నుతిమయ,స్తుతి,ఆక్రంద నా,పరితప్త,నీరస,అహంక రి,విపత్,శోభాహీన,తాజస,పీడిత,గర్భ"ఆక్రోసినీ"-వృత్ తము.
రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
"ఆక్రోసినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.భ.మ.స.భ.మ.ర.ర.గ గ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
దురహంకారము మిన్నంటెం?దురితాక్రోస విపత్తిం! తోయంబు పాతాళముం జేరెన్?
పర పీడంబది మించెంగా! పరితప్తంబయె లోకం?ప్రాయాలు ప్రాణాంతమై యొప్పెన్?
నిరతానందము నీచంబై!నిరసించచెన్ప్రభ లెన్నం?నేయంబు హేయంబయెం గాంచన్?
గరికల్జీవిత స్వేచ్ఛేదీ?కరటౌ! ద్రోహుల చర్యల్! గాయంబయెం శోభలుం ధాత్రిన్?
1.గర్భగత"-నుతిమయ"-వృత్తము.
బృహతీఛందము.స.భ.మ.గణములు.వృ.సం. 52.ప్రాసగలదు.
దురహంకారము మిన్నంటెన్?
పరపీడంబది. మించెంగా!
నిరతానందము నీచంబై
గరికల్జీవిత స్వేచ్ఛేదీ?
2.గర్భగత"-స్తుతి"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.భ.గగ.గణములు.వృ .సం.52.ప్రాసగలదు.
దురితా క్రోస విపత్తిన్?
పరితప్తంబయె? లోకం!
నిరసించెం? ప్రభ లెన్నం?
కరటౌ!ద్రోహుల చర్యల్?
3.గర్భగత"-ఆక్రందవృత్మత్తము.
బృహతీఛందము.త.త.మ.గణములు.వృ.సం. 37.ప్రాసగలదు.
తోయంబు పాతాళముం జేరెం?
ప్రాయాలు ప్రాణాంతమై యొప్పెన్?
నేయంబు హేయంబయెం? గాంచన్?
గాయంబయెం? శోభలుం? ధాత్రిన్?
4.గర్భగత"-పరితప్త"-వృత్తము.
అత్యష్టీఛందము.స.భ.మ.స.భ.గగ.గణము లు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
దురహంకారము మిన్నంటెం!దురితాక్రోశ విపత్తిం?
పరపీడంబది మించెగా! పరితప్తంబయె లోకమున్?
నిరతానందము నీచంబై! నిరశించెం ప్రభలెన్నం?
గరికల్జీవిత స్వేచ్ఛేదీ?కరటౌ ద్రోహుల చర్యల్?
5.గర్భగత"-నీరస"-వృత్తము.
అత్యష్టీఛందము.స.భ.మ.ర.ర.గగ.గణము లు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
దురితాక్రోశ విపత్తిం?తోయంబు పాతాళముం జేరెన్?
పరితప్తంబయె లోకముం?ప్రాయాలు ప్రాణాంతమై యొప్పెం?
నిరసించెం ప్రభలెన్నం?నేయంబు హేయంబయెం గాంచన్?
కరటౌ ద్రోహుల చర్యల్?గాయంబయెం?శోభలుం ధాత్రిన్?
6.గర్భగత"-అహంకరి"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.భ.మ.ర.ర.త.య.స.గ గ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
దురితాక్రోశ విపత్తిం!తోయంబు పాతాళముం జేరెం!దురహంకారము మిన్నంటెన్?
పరితప్తంబయె లొకముం?ప్రాయాలు ప్రాణాంతమై యొప్పెం?పర పీడంబది మించెగా!
నిరసించెం ప్రభ లెన్నం? నేయంబు హేయంబయెం గాంచం?నిరతానందము నీచంబై!
కరటౌ ద్రోహుల చర్యల్!గాయంబయెం?శోభలుం ధాత్రిం?గరికల్జీవిత స్వేచ్ఛేదీ?
7.గర్భగత"-విపత్"-వృత్తము.
ధృతిఛందము.త.త.మ.స.భ.మ.గణములు.య తి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
తోయంబుపాతాళముం జేరెం!దురహంకారము మిన్నంటెన్?
ప్రాయాలు ప్రాణాంతమై యొప్పెం? పర పీడం బది మించెగా!
నేయంబు హేయంబయెం గాంచం?నిరతానందము నీచంబై!&
గాయంబయెం?శోభలుం ధాత్రిం?గరికల్జీవిత. స్వేచ్ఛేదీ?
8.గర్భగత"-శోభాహీన"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.త.మ.స.భ.మ.స.భ. గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
తోయంబు పాతాళముం జేరెం!దురహంకారము మిన్నంటెం?దురితాక్రోశ విపత్తిన్?
ప్రాయాలు ప్రాణాంతమై యొప్పెం?పరపీడంబదిమించెగా!పరి తప్తంబయె లోకమున్!
నేయంబు హేయంబయెం గాంచం?నిరతానందము నీచంబై! నిరసించెం ప్రభలెన్నం?
గాయంబయెం?శోభలుం ధాత్రిం?గరికల్జీవిత స్వేచ్ఛేదీ?కరటౌ ద్రోహుల చర్యల్!
9.గర్భగత"-తాజస"-వృత్తము
అత్యష్టీఛందము.స.భ.త.జ.స.గగ. గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
దురితాక్రోశ విపత్తిం?దురహంకారము మిన్నంటెన్?
పరితప్తంబయె లోకముం!పరపీడంబది మించెగా!
నిరసించెం ప్రభలెన్నం? నిరతానందము నీచంబై!
కరటౌ ద్రోహుల చర్యల్! గరికల్జీవిత స్వేచ్ఛేదీ?
10,గర్భగత"-పీడిత"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.భ.త.జ.స.మ.ర.ర. గగ.గణములు.యతులు.9,18,
ప్రసనీమముగలదు.
దురితాక్రోశ విపత్తిం?దురహంకారము మిన్నంటెం?తోయంబు పాతాళముం జేరెన్!
పరితప్తంబయె లోకముం! పరపీడంబది మించెగా!ప్రాయాలు ప్రాణాంతమై యొప్పెన్?
నిరసించెం ప్రభ లెన్నం? నిరతానందము నీచంబై! నేయంబు హేయంబయెం గాంచన్?
కరటౌ ద్రోహుల చర్యల్!గరికల్జీవిత స్వేచ్ఛేదీ?గాయంబయెం ? శోభలుం ధాత్రిన్?
స్వస్తి..
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
2 comments:
నమస్కారములు
అన్ని వృత్తములు అలరించు చున్నవి పండితుల వారికి ప్రణామములు
నమస్కారములు
" నుతిమయ, స్తుతి, ఆక్రందనా, నీరస వృత్తములన్నియు అలతి, అలతి పదములతో అలరించు చున్నవు. శ్రీ వల్లభవఝులవారికి అభినందన మందారములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.