జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
86. శా. మన్నింపంబడుదీవు శోభన లసన్మాన్యంబుగాఁ జేసి సం
పన్నంబౌనటు చేయఁ
గల్గిన మమున్. మా జీవితంబున్, స్వభా
వౌన్నత్యంబున వెల్గఁజేయుచు నిరంతానంద సంధాయి ! శ్రీ
మన్నారాయణ!
సత్ప్రవృద్ధ మహితా ! మామాటలాలింపుమా.
భావము. అంతులేని ఆనందమును కలిగించువాడా ! మంచిని
పెంచెడివాడా ! ఓ శ్రీమన్నారాయణా! మా మాటలను ఆలకించుము. మమ్ము శోభన
ప్రకాశముతో శ్రేష్టముగా చేసి , మా
జీవితమును
సుసంపన్నమగునట్లు చేయగలిగితివేని నీవు ఎల్లప్పుడూ మన్నింపబడుదువు.
87. శా. యన్నామైవ మహత్ప్రపుణ్యఫలదమ్ , హర్ష ప్రదమ్ , సత్ప్రదమ్,
యన్నామైవ దురంత పాప హరణమ్ , యత్ సౌఖ్యదమ్ ,
భాగ్యదమ్ ,
తన్నామైవ త్వదీయ
నామ యనుచున్ దర్శింత్రు భక్తాళి. శ్రీ
మన్నారాయణ! నీదు
నామమెదలో మార్మ్రోగనీ నిత్యమున్.
భావము.
ఓ
శ్రీ మన్నారాయణా! ఏ పేరు జగత్తున ఏకైక పుణ్య ఫలమునొసగునో , ఏ పేరు అత్యద్భుతమైనదో , ఏ పేరైతే పాపములు పోకొట్టెడి గొప్పదైన
పేరో , ఏ
పేరైతేఆయువునొసంగునో , ఆ పేరు నీ పేరే
అనుచు భక్తులు ఆత్మలో దర్శింతురు. నీ నామమును
నిత్యమూ మా మదిలో
మార్మ్రోగునట్లనుగ్రహింపుము.
88. శా. ఎన్నున్ భారత జాతి నీ ప్రతిభ, నీ సృష్టిన్, బ్రవర్ధింప నీ
కన్ననన్ కర్తయు, కర్మయున్, క్రియయు లోకంబందు లేరం చిటుల్
నిన్నున్నమ్మగఁ జేసినట్టి ఘనుడా.
నిన్నెట్లు కీర్తింతు? శ్రీ
మన్నారాయణ! భారతీయుల మదిం భాసించుమెల్లప్పుడున్.
భావము. ఓ శ్రీమన్నారాయణా! ఈ సృష్టిని ప్రవర్ధింపఁ జేయుటలో నీకన్నా కర్త, కర్మ, క్రియ, వేరొకరు లేరని భారత జాతి నీ ప్రతిభను గుర్తించును. ఈ విధముగానిన్ను నమ్ము విధముగా చేసిన గొప్పవాడా. నిన్నేవిధముగా నేను పొగడగలను? నీవు యెల్లప్పుడూ భారతీయుల మనసులలో ప్రకాశించుచూ ఉండుము.

89. శా. పున్నామాదిగ గల్గు యీ నరకముల్ పూరింప
మాచేత నీ
వన్నీ గాంచుచు పాప
కార్యములు మోహభ్రాంతిఁ
జేయింతువా !
ఆన్నన్నా!
మనసెట్టులొప్పు నరకంబందున్ మమున్నిల్ప. శ్రీ
మన్నారాయణ! మంచి చేసెడి మతిన్ మాకిమ్ము నిన్గొల్వగాన్.
భావము.
ఓ
శ్రీ మన్నారాయణా ! పున్నామాది మహా నరకములను నింపుటకని నీవన్నీచూచుచూకూడా మోహాదులు కల్పించి
మాచేత పాపములు చేయించుచున్నావా? అన్నన్నా. మమ్ములను నరకమున నిలుపుటకు నీకు మనసెట్టులొచ్చును ? మంచి చేయవలెననెడి బుద్ధి మాకిమ్ము. నిన్నుకొలిచెదము.
90. శా. ఎన్నో జన్మల పుణ్య
సత్ఫలముగానిద్ధాత్రి సీతమ్మ నీ
కన్నుల్ కాంతిగ వెల్గ నీ సతిగ, భూకాంతారమావల్లభా!
మిన్నున్ ముట్టదె మాదు సంబరము సామీ చేయ మీ పెండ్లి. శ్రీ
మన్నారాయణ! భక్తులన్ సతము ప్రేమం జూచి దీవింపుడీ.
భావము. ఓ శ్రీమన్నారాయణా! ఓభూకాంతారమావల్లభా! ఓ స్వామీ! పెక్కు జన్మలలో చేసిన పుణ్యఫలముగా ఈ ధాత్రిపై సీతమ్మతల్లి నీ పత్నియై నీ కన్నులలో కాంతియై ప్రకాశించు విధముగా మీ వివాహము చేయుటచే మా సంతోషము ఆకాశమునంటును. మీరెల్లప్పుడూ భక్తులను కృపతో చూచుచు దీవించుడు.

జైహింద్
1 comments:
నమస్కారములు
అన్ని పద్యములు అలరించు చున్నవి .అద్భుతమైన శతకమును అందించినందులకు కృతజ్ఞతలు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.