జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
71. శా. సన్నేతల్ మహనీయతా గరిమతో
సత్కార్యముల్ చేయుచున్,
నిన్నేమున్ను స్మరింత్రు సంతసమునన్ నీ దివ్య తేజంబె సం
పన్నంబౌనటు చేయ కార్యముల నుద్భాసింపగాఁ జేసి. శ్రీ
మన్నారాయణ ! సజ్జనాళి కృషినే మన్నించి దీవించుమా.
భావము.
ఓశ్రీమన్నారాయణా ! మంచి నాయకులు వారికిగల మహనీయత యొక్క ఆధిక్యముతో మంచి పనులు చేయుచు, నీకు గల గొప్ప తేజస్సే తాము చేపట్టిన కార్యము ప్రకాశితమగునట్లు చేసి సుసంపన్నము అగునట్లు చేయుట కొఱకు ముందుగా సంతోషముతో నిన్నే స్మరించుదురు. అట్టి మంచివారి ప్రయత్నమును నీవు మన్నించి వారిని దీవింపుము.

72. శా. సన్నంబై చనుచుండెనాయువు. మన:శాంతిన్ నినుం గొల్వనే.
క్రన్నన్ వచ్చి ప్రశాంతిఁ గూర్చుమయ. నాకన్నన్ హితుల్ లేరనన్.
మన్నైపోవకమున్నె నేను నిను సమ్మాన్యా! మదిం గాంచ శ్రీ
మన్నారాయణ ! నీ పదాంబుజములం బ్రాణంబు చేరున్ గదా.
భావము. సమ్మాన్యుడవైనవాడా! ఓ శ్రీమన్నారాయణా! చిన్నదయిపోవుచు నా ఆయుర్దాయము తరిగిపోవుచున్నది. నేను శాంత మనస్కుడనై కనీసము మనసులో భావింపనైను లేదు. నా కన్నా హితులు నీకు లేరనునట్లుగా నీవు వెంటనే వచ్చి నాకు ప్రశాంతత కలిగించుము. నేను భూమిలో కలిసిపోవక మునుపే నిన్ను మనసులో చూచినచో నా ప్రాణము నీ పాద పద్మములను చేరును కదా.

73. శా. నిన్నన్, మొన్నను, నేడు, రేపు, సతమున్ నీ నామ సంకీర్తనే
నన్నున్ నిల్పెడి
ప్రాణశక్తి, నృహరీ! నాకున్న
ధీశక్తియున్.
మన్నింపంబడు పద్యధారవగుచుం బ్రాప్తించుచున్ బ్రోచు శ్రీ
మన్నారాయణ! నిన్ స్మరించు గుణమున్ మాకిమ్ము నిత్యంబుగా.
భావము. ఓనరసింహా! భూత భవిష్యద్వర్తమానములందు ఎల్లప్పుడు నీ నామ సంకీర్తనమే నన్ను నిలుపు ప్రాణశక్తి. నా ధీశక్తియునదియే. మన్నింపఁబడెడి పద్యధారవయి ప్రాప్తించుచు బ్రోచెడి ఓశ్రీమన్నారాయణా! నిన్ను స్మరించెడి
గుణమును నిత్యముగా మాకు ప్రాప్తింపఁజేయుము.

74. శా. ఎన్నం జాలని భవ్య భాగవతులన్ హృద్యంబుగానొప్పు శ్రీ
మన్నామాద్భుత వాక్సుధా లహరివా ? మచ్చిత్త సంవాసివై
క్రన్నన్ వెల్వడు సత్ కవిత్వ ఝరివా ? కారుణ్యవారాశి! శ్రీ
మన్నారాయణ! దివ్య శక్తినిడి , నీమంబొప్ప నిన్ గొల్వనీ. .
భావము. ఎన్నజాలనంతటి గొప్ప భాగవతోత్తములలో హృద్యముగానొప్పునట్టి శ్రీమన్నారాయణునికిసంబంధించిన వాగమృత లహరివా ? నా హృదయమున నివశించుచు క్రన్నన వెల్వడునటువంటి మంచి కవితా ప్రవాహమా నీవు? కరుణా సముద్రుడివా ? ఓ శ్రీ మన్నారాయణా ! మాకు దివ్యమైన శక్తినొసగి నిన్ను భక్తితో సేవించునట్లు చేయుము.

75. శా. ఎన్నోశంకలవాత్మలో కలుగు నీ వీతీరునీ సృష్టి చే
యన్నీకున్ గల
మూలమేది ? మహనీయంబైన యామూలమీ
వెన్నాళ్ళే
తపమాచరించి గనితో ? సృష్ట్యాదినే నీకు
శ్రీ
మన్నారాయణ!
సాధ్యమెట్లయినదో ? మా శంక
పోకార్పుమా.
భావము.
ఓ
శ్రీమన్నారాయణా ! ఎన్నో అనుమానములు ఐవి నా ఆత్మలో కలుగుచున్నవి. నీవు ఏ విధముగా ఈ సృష్టిని చేయుటకు నీకు
కలిగిన మూలాధారమేది ? గొప్పలయిన ఆ మూలాధారమును నీవు ఎన్నాళ్ళు ఎటువంటి
తపస్సూను చేసి పొఃదితతివో?
సృష్ట్యాదినే నీకు
ఇది ఏవిధముగా సాధ్యమయినదో ? మా అనుమానములను నివృత్తి చేయుము.
జైహింద్
1 comments:
నమస్కారములు
జై శ్రీమన్నారాయణ నమోనమ:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.